నాగార్జున గారు.. కనిపించరేంటి సార్?

నాగార్జున గారు.. కనిపించరేంటి సార్?

రాజ్ తరుణ్ మూవీ రంగుల రాట్నం సంక్రాంతి పండుగకు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి.. జైసింహా లాంటి భారీ చిత్రాలు.. సూర్య నటించిన గ్యాంగ్ రిలీజ్ అవుతున్నా సరే.. రంగుల రాట్నం రేసులో నిలవడం ఆశ్చర్యం కలిగించినా.. ఈ మూవీని అక్కినేని నాగార్జున నిర్మించడంతోనే.. చెప్పుకోదగిన సంఖ్యలో స్క్రీన్స్ దక్కాయి.

అయితే.. రంగుల రాట్నం మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైనే నిర్మించినా.. ఈ చిత్రాన్ని సపోర్ట్ చేసేందుకు నాగార్జున ముందుకు రాకపోవడం ఆశ్చర్యకరం. సహజంగా తను నటించినా.. నిర్మించినా.. నాగ్ నుంచి వచ్చే సపోర్ట్ ఆయా సినిమాలకు బాగా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా ఓపెనింగ్స్ విషయంలో నాగ్ ప్రెజెన్స్ బాగా హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ తెలిసినా సరే.. రంగుల రాట్నం ప్రమోషన్స్ లో నాగార్జున కనిపించడం లేదు. ఇందుకు హలో ఇచ్చిన షాక్ కారణం అనుకుంటున్నారు. ఓ మూవీపై ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటేనే.. 'వస్తున్నాం.. కొడుతున్నాం' అనే మాటను ఉపయోగిస్తారు నాగార్జున.

ఒక్క హలో విషయంలో తప్పిస్తే.. మిగిలిన అన్ని సార్లు నాగ్ ఈమాట చెప్పినపుడు సక్సెస్ లు వచ్చాయి. కానీ హలోకు మాత్రం నాగ్ చెప్పినా సక్సెస్ రాలేదు. దీంతో నాగార్జున హర్ట్ అయ్యారట. ఇప్పుడు బయటకు వస్తే.. మీడియా జనాలకు హలో ఫెయిల్యూర్ పై వివరణ ఇవ్వాల్సి వస్తుందని భావిస్తున్నారని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు