సంజన పైనా కత్తి దూస్తాడా!?

సంజన పైనా కత్తి దూస్తాడా!?

టాలీవుడ్ కి తన వంతుగా చేసినది ఏమీ లేకపోయినా.. కనీసం సినిమాలపై ఆలోచనాత్మక విమర్శలు చేయడం రాకపోయినా.. రివ్యూలు అంటూ నాలుగు మాటలు చెప్పేసి అదే తన ఘనత అనుకుంటున్న కత్తి మహేష్.. ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు.

పవన్ కళ్యాణ్ అటు రాజకీయంగాను.. ఇటు సినిమాల పరంగాను యాక్టివ్ గా ఉన్న సమయంలో వ్యక్తిగత జీవితంపై కూడా కామెంట్స్ చేస్తూ రచ్చ చేస్తున్నాడు కత్తి. రీసెంట్ గా పూనమ్ కౌర్ పై కూడా దారుణమైన కామెంట్స్ చేయగా.. వీటికి సపోర్ట్ కంటే వ్యతిరేకత ఎక్కువ వచ్చింది. పవన్ కు సపోర్ట్ గా ట్వీట్ పెట్టి.. ఎంప్లాయ్ మెంట్ ప్రాబ్లెం అని అన్నందుకే పూనమ్ టార్గెట్ అయింది. ఇప్పుడు మరో భామ నుంచి పవన్ కు సపోర్ట్ వచ్చింది. సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో విలన్ భార్యగా నటించిన సంజనా గల్రానీ.. 'నలుగురిలో నోటీస్ అయేందుకు జనాలు ఇతర మార్గాలు చూసుకోవడం మంచిది. గౌరవ మర్యాదలు గల విజయవంతమైన వ్యక్తులను డీఫేమ్ చేయడం కంటే.. కష్టపడి పేరు తెచ్చుకోవడం సరైన పని. మేం మీతో పవన్ కళ్యాణ్ గారు' అంటూ.. పవన్ తో కలిసి దిగిన ఓ ఫోటోను పోస్ట్ చేసింది సంజన.

ఇదే తరహా మాటలు చెప్పినందుకే పూనమ్ కౌర్ పై కత్తి విరుచుకుపడుతున్నాడు. ఇప్పుడు సంజన నుంచి సపోర్ట్ వచ్చింది. పైగా వీటిలో పవన్ ను పొగడ్డం కంటే.. పవన్ ను విమర్శిస్తున్న వారిని తిట్టిపోయడమే ఎక్కువగా కనిపిస్తోంది. మరి ఇప్పుడీ బుజ్జిగాడు భామపై కూడా కత్తి దూస్తాడా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు