సరోగసీకి ఐశ్వర్యరాయ్ ఒప్పుకుందా?

సరోగసీకి ఐశ్వర్యరాయ్ ఒప్పుకుందా?

మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యా రాయ్ ఇప్పటికే తల్లిగా మారిన సంగతి తెలిసిందే. ముద్దులొలికే ఆరాధ్యకు తగినంత వయసు వచ్చే వరకూ సినిమాలకు దూరంగానే ఉంది ఈ  బ్యూటీ. మళ్లీ ఇప్పుడు గర్భవతి అయిందా అనుకోవచ్చు కానీ.. ఇది రియల్ లైఫ్ మ్యాటర్ కాదు.

ఆన్ స్క్రీన్ లో ఆమెను అమ్మగా మారమని అడిగారట మేకర్స్. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ వంటి కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ తో ఆకట్టుకుంటున్న దర్శకుడు శ్రీనారాయణ సింగ్.. జాస్మిన్ అనే కొత్త చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. జాస్మిన్ అనే టైటిల్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఫస్ట్ లుక్ ఇచ్చారు. ఇందులోనే మూవీ కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు మేకర్స్. సరోగసీ .. అంటే గర్భం అద్దెకు ఇవ్వడం అనే థీమ్ పై ఈ చిత్రం రూపొందనుంది. మొదటగా తన గర్భాన్ని అద్దెకు ఇచ్చేందుకు ఒప్పుకోవడం.. ఆ సమయంలో ఎదురయ్యే కష్టాలు.. బిడ్డను కన్న తర్వాత తిరిగి అప్పగించలేకపోవడం వంటి థీమ్ తోనే ఈ ఛిత్రం సాగనుందని తెలుస్తోంది. అయితే.. గర్భవతిగా నటించడం అంత సలువైన వ్యవహారం కాదు.

ఈ పాత్రకు ఐశ్వర్యారాయ్ లాంటి ఫ్యాన్ బేస్ ఉన్న ఆర్టిస్ట్ చేస్తే.. ఆ కథకు న్యాయం జరుగుతుందని అంటున్నారు నిర్మాతలు. జాస్మిన్ మూవీ పై ఇప్పటికే ఐష్ తో  చర్చలు జరగగా.. ఇంకా ఆమె నుంచి రెస్పాన్స్ ఏంటో తెలియలేదట. అయితే.. పైకి ఇలా చెబుతున్నా.. ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాకే ఫస్ట్ లుక్ ఇఛ్చారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ లో గర్భంపైనే సోల్డ్ అని రాయడం.. డెలివరింగ్ సూన్ అని క్యాప్షన్ పెట్టడం ఆకట్టుకుంటున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English