ఈ ట్రైలర్ లెక్కలు తేల్చేస్తోందా?

ఈ ట్రైలర్ లెక్కలు తేల్చేస్తోందా?

 సినిమాలకు సీజన్ ముఖ్యమే కానీ.. అందరికీ హాలిడే సీజన్ దొరకడం కూడా కష్టం. అందుకే పలు క్రేజీ మూవీస్.. లాంగ్ వీకెండ్ ఉండేలా డేట్ చేసుకుని రిలీజ్ చేస్తుంటారు. టాలీవుడ్ లో పొంగల్ సీజన్ తర్వాత అంతగా రిపబ్లిక్ డే వీకెండ్ కి డిమాండ్ ఏర్పడింది. జనవరి 25.. 26లలో పలు చిత్రాలు థియేటర్లలోకి వస్తున్నాయి.

దండుపాళ్యం3.. రాజరథం చిత్రాలు జనవరి 25న విడుదల అవుతుండగా.. ఆ తర్వాతి రోజున భాగమతి.. ఆచారి అమెరికా యాత్ర.. మనసుకు నచ్చింది.. అభిమన్యుడు మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటివరకూ వీటిలో ఏ సినిమాకి క్రేజ్ ఉందనే అంచనాలు వినిపించాయి. కానీ తాజాగా అనుష్క మూవీ భాగమతికి థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశాడు. ఈ ట్రైలర్ చివర్లో అనుష్క ఓ డైలాగ్ కొడుతుంది. "ఎవడు పడితే వాడు రావడానికి.. ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి.. ఇదేమన్నా పశువుల దొడ్డా.. భాగమతి అడ్డా.. లెక్కలు తేలాలి.. ఒక్కడినీ పోనివ్వను" అంటూ బెదిరించేస్తుంది స్వీటీ. నిజంగానే ఈ ట్రైలర్ తర్వాత లెక్కలు కొత్తగా మారిపోయాయని చెప్పాలి.

మరోసారి అరుంధతి రేంజ్ సినిమా చూడబోతున్నామనే ఫీలింగ్ అందరిలోనూ కలుగచేయడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. అలాగే రిపబ్లిక్ డే వీకెండ్ కి షెడ్యూల్ చేసిన సినిమాల్లో.. ఇప్పుడు అనుష్కదే అప్పర్ హ్యాండ్ అనడంలో ఆశ్చర్యం లేదు. లెక్కలు తేలాలి అని సినిమాలో భాగమతి ఎందుకు అంటుందో కానీ.. ఇక్కడ మాత్రం ముందునుంచే లెక్కలు తేల్చేసే పనిలో పడింది అనుష్క.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English