హ్యాట్రిక్ మూవీతో సూపర్ స్టార్ ఖేల్ ఖతం

హ్యాట్రిక్ మూవీతో సూపర్ స్టార్ ఖేల్ ఖతం

రజినీకాంత్ ఇప్పుడు ఫుల్ బిజీ అయిపోయారు. సహజంగా తీరిగ్గానే సినిమాలు చేసే ఆయన.. ఇప్పుడు ఒకవైపు సినిమా.. మరోవైపు పాలిటిక్స్ ను పట్టించుకోవాల్సి వస్తోంది. పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన ఆయన.. ఇంకా పేరు - విధి విధానాలు - భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాల్సి ఉంది. మరి పాలిటిక్స్ లోకి ఫుల్ ప్లెడ్జెడ్ గా వచ్చేసిన తర్వాత.. సినిమాల్లో కంటిన్యూ కావడం తమిళనాట ఆనవాయితీ కాదు. అందుకే సినిమాలకు కూడా ముగింపు పలకాలని ఫిక్స్ అయ్యారట రజినీ.

ఏప్రిల్ 14న రజినీకాంత్ - శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రోబో సీక్వెల్ 2.ఓ రిలీజ్ కానుంది. ఇప్పటికే మరో మూవీని కూడా ఫినిష్ చేశారు సూపర్ స్టార్. కాలా కరికులన్ పేరుతో కబాలి ఫేమ్ పా రంజిత్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపందగా.. 2.ఓ రిలీజ్ కోసం ఈ సినిమాను హోల్డ్ చేశారు. ఈ లెక్కన కాలా మూవీ రజినీకి ఆఖరిది అనే ప్రచారం జరుగుతోంది. కానీ సూపర్ స్టార్ ఆలోచనలు వేరేలా ఉన్నాయట. మాఫియా డాన్ గా నటించిన చిత్రం తన కెరీర్ లో చివరిది అయేందుకు ఆయన ఇష్టపడ్డం లేదట. తన పొలిటికల్ ఐడియాలజీకి అనుగుణంగా ఓ సినిమా తెరకెక్కించాలని భావించి.. అదే విషయాన్ని పా రంజిత్ చెవిన వేశారట రజినీకాంత్. ఈయన ఆలోచనలకు తగినట్లుగానే ఓ స్టోరీ లైన్ ను వినిపించాడట దర్శకుడు.

కబాలి.. కాలా తర్వాత.. వీరిద్దరూ కలిసి ముచ్చటగా మూడో సినిమా కూడా చేయాలని డిసైడ్ అయిపోయారని తెలుస్తోంది. ఈ సినిమాలో రజినీ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని.. ఆయన పొలిటికల్ ఎంట్రీకి హెల్ప్ అయేలా ఉంటుందని తెలుస్తోంది. ఏమైనా రజినీకాంత్ లాంటి స్టార్ తో షార్ట్ టెర్మ్ లోనే మూడు సినిమాలు చేసే అవకాశం దక్కించుకుని పారంజిత్ కొత్త రికార్డు సృష్టిస్తుండగా.. ఈ దర్శకుడి సినిమానే చివరిది కావడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు