మహేష్ కత్తి ఫస్ట్ టైం దొరికిపోయాడు

మహేష్ కత్తి ఫస్ట్ టైం దొరికిపోయాడు

పవన్ కళ్యాణ్ అభిమానులకు.. మహేష్ కత్తికి మధ్య గొడవకు కారణాలేమైనప్పటికీ.. ఈ గొడవలో ఇరు వర్గాలూ హద్దులు దాటిన మాట వాస్తవం. దీంతో ఈ వివాదం పతాక స్థాయికి వెళ్లిపోయింది. నిన్నటి ప్రెస్ మీట్లో మహేష్ కత్తి చేసిన ఆరోపణలు సంచలనం రేకెత్తించాయి. దీంతో అతడిపై దాడిని మరింత ఉద్ధృతం చేశారు అభిమానులు. ఐతే కొన్ని నెలలుగా పవన్ అభిమానులు తనపై అటాక్ చేస్తున్నప్పటికీ మహేష్ కత్తి బెదరట్లేదు. వాళ్లకు ఎక్కడికక్కడ దీటుగానే బదులిస్తున్నాడు. తన వాదన బలంగా వినిపిస్తున్నాడు. టీవీ చర్చల్లో కొన్నిసార్లు తడబడ్డప్పటికీ.. పూర్తిగా డౌన్ అయిన పరిస్థితి అయితే లేదు.

కానీ తొలిసారి నిన్న ఒక టీవీ ఛానెల్ చర్చలో మహేష్ కత్తి దొరికిపోయాడు. సమాధానం చెప్పలేక.. ఒక్క మాట మాట్లాడుకుండా రెండు మూడు నిమిషాలు మౌనం పాటించాడు. అంతే కాదు.. మధ్యలో చర్చ వదిలేసి.. ఛానెల్ నుంచి నిష్క్రమించాడు. మహేష్ ఇలా పలాయనం చిత్తగించేలా చేసిన వ్యక్తి పేరు వివేక్. అతనో దర్శకుడు.. రచయిత కూడా అట. ఇంతకీ వివేక్ ఏం అడిగితే.. మహేష్ అలా వెళ్లిపోయాడన్నది ఆసక్తికరం. మీ తల్లి గురించి రెండు నిమిషాలు చెప్పండి అని అడిగాడు వివేక్. కుదరదని అన్నాడు మహేష్. వివేక్ వదలకుండా.. మీ తల్లి చాలా మంచి వారు.. గొప్పవారు అయి ఉంటారు కదా దయచేసి మాట్లాడండి అన్నాడు. ఐతే కాదనే హక్కు నాకుంది అన్నాడు మహేష్. ఐతే పూనమ్ కౌర్ గురించి చాలా మాట్లాడారు.. ఆరోపణలు చేశారు.. మరి మీ తల్లి గురించి మాట్లాడమంటే ఎందుకు మాట్లాడరు అని అడిగాడు వివేక్. తానేమీ వేరే దృష్టితో ఇలా అడగట్లేదని.. మీ తల్లి గురించి మాట్లాడదాం అని మాత్రమే అడుగుతున్నానని వివేక్ రెట్టించాడు. దీంతో కత్తి ఎన్నడూ లేని విధంగా మౌనం వహించాడు. రెండు నిమిషాలు అలాగే ఉండిపోయాడు. చివరికి నేను ఈ విషయంలో మాట్లాడలేనంటూ స్టూడియో నుంచి లేచి వెళ్లిపోయాడు. సంబంధిత వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

మొన్నటిదాకా మహేష్ కత్తి ఏం మాట్లాడినా అర్థవంతంగానే ఉండేది కానీ.. పూనమ్ కౌర్ తన పేరెత్తకపోయినా.. ఆమె తననే అందంటూ ఆమె మీద వ్యక్తిగతంగా తీవ్ర ఆరోపణలు చేయడంతో కత్తిపై వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో పూనమ్ మీద సానుభూతి వ్యక్తమవుతోంది. ఇండస్ట్రీ జనాలు సైతం ఆయన మీద ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. పూనమ్ ‘మా’ సభ్యురాలైన నేపథ్యంలో కత్తిపై చర్యలు చేపట్టడానికి కూడా రంగం సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక పూనమ్ మీద మాత్రం ఎలా పడితే అలా ఆరోపణలు చేసిన కత్తి.. తన తల్లి గురించి అడిగితే మాత్రం సైలెంటైపోవడం ద్వారా విమర్శకులకు అవకాశమిచ్చాడు. నిజానికి ఆ చర్చలో కత్తి తల్లి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది సమంజసం కూడా కాదు. కానీ పూనమ్ కూడా ఒక మహిళే కదా. ఆమెపై కత్తి అంతేసి ఆరోపణలు చేసినప్పుడు ఆ చర్చలో అతడి తల్లి ప్రస్తావన తేవడాన్ని వివేక్ సమర్థించుకున్నాడు. పైగా అతనేమీ ఆరోపణలు కూడా చేయలేదు. జస్ట్ తల్లి గురించి చెప్పమన్నాడంతే. దానికే కత్తి చర్చ నుంచి నిష్క్రమించడంతో అతను ఆత్మరక్షణలో పడ్డాడని స్పష్టమైంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English