పవన్ సాయం కోరిన పూనమ్ కౌర్

పవన్ సాయం కోరిన పూనమ్ కౌర్

కత్తి మహేష్-పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య గొడవలోకి కొత్తగా పూనమ్ కౌర్ వచ్చి పడింది. రెండు రోజులుగా ఆమె పేరు మీడియాలో తెగ నానుతోంది. తనను ఉద్దేశించి పరోక్ష విమర్శలు చేసిందన్న కారణంతో ఆమెపై తీవ్ర స్థాయిలో దాడికి దిగాడు మహేష్ కత్తి. నిన్న పూనమ్ కౌర్‌కు పవన్ కళ్యాణ్‌కు ముడిపెడుతూ ఆయన సంధించిన ప్రశ్నలు సంచలనం రేపాయి. ఇందులోని ఆరోపణల్ని కొందరు తేలిగ్గా కొట్టి పారేస్తుండగా.. నిప్పు లేనిదే పొగ రాదు కదా.. కత్తి దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయంటున్నాడు కదా అంటూ సందేహాలు వెలిబుచ్చుతున్నారు కొందరు.

ఇదిలా ఉంటే కత్తి తనపై చేసిన ఆరోపణలపై ఏమీ స్పందించని పూనమ్ కౌర్.. తనను ఆదుకోవాలంటూ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ట్వీట్లు చేయడం విశేషం. ‘‘గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారూ. ఈ పరిస్థితుల నుంచి నన్ను బయటపడేయడానికి మీ సాయం కోరుతున్నా. ఎందుకంటే ఇది నా కెరీర్‌కు, కుటుంబానికి, అన్నింటికీ మించి నా గౌరవానికి సంబంధించిన విషయం. రహస్య అజెండాలతో పని చేసే వ్యక్తుల రాజకీయ లక్ష్యంగా మారాలని నేను కోరుకోవడం లేదు. అందుకే నేను మిమ్మల్ని కలిసి ఈ విషయమై మాట్లాడాలనుకుంటున్నా’’ అని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ హ్యాండిల్‌ను ట్యాగ్ చేస్తూ పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది.

మరి పూనమ్ బాధను అర్థం చేసుకుని పవన్ ఆమెకు కలిసే అవకాశమిస్తాడా.. లేక లేని పోని ఊహాగానాలకు తావివ్వడం ఎందుకని సైలెంటుగా ఉంటాడా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు