ఆమెకు సహజమే.. కుర్రాళ్ళకే కష్టం

ఆమెకు సహజమే.. కుర్రాళ్ళకే కష్టం

ఇంగ్లండ్ అందం అమీ జాక్సన్ ఎప్పటికప్పుడు తన అందాలను తెగ ఆరబోసేస్తూ ఉంటుంది. పైగా తన బాడీ బికినీకి పర్ఫెక్ట్ అని.. తనకు నప్పినట్లుగా బికినీ ఇంకెవరికీ నప్పదని పబ్లిక్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చేయగల తెగువ అమీ జాక్సన్ సొంతం. ఇండియాలోనే ఇలా బికినీ షోకులను తెగ ఆరబోసేసిన అమీ జాక్సన్.. విదేశాలకు అందునా వెకేషన్స్ కు వెళితే ఇంకెలా ఉంటుందో ఊహించేసుకోవచ్చు.

అలా ఊహల్లోనే ఉంటున్న అభిమానులకు ఆ దృశ్యాలు కూడా అందేస్తున్నాయి. రీసెంట్ గా మెక్సికోలో షికార్లు కొట్టింది అమీ జాక్సన్. ఇక్కడి బీచ్ ల చుట్టూ తెగ చక్కర్లు కొట్టేయగా.. ఆ విహారాలకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. బికినీ బేబ్ గా అమీ రూపాన్ని చూసి తెగ మురిసిపోతున్నారు కుర్రకారు. వంపుసొంపులను చూసి మైమరచిపోతున్నారు. ఇంతగా అందాల విందు చేస్తున్న అమీ జాక్సన్ ను చూసి విలవిల్లాడిపోతున్నారు కుర్రాళ్లు.

ఇలా శృతి మించి అందాలను ప్రదర్శించడంలో అమీకి పెద్దగా అభ్యంతరాలు ఏమీ ఉండవు సరికదా.. ఇవన్నీ చాలా క్యాజువల్ అనేస్తుంది ఈ భామ. కానీ ఇంతలేసి అందాలను చూసి తట్టుకోవడం.. పాపం కుర్రాళ్లకే సాధ్యం కావడం లేదు. ఇఖ సినిమాల విషయానికి వస్తే.. రజినీకాంత్ మూవీ 2.ఓ లో లేడీ రోబోగా కనిపించనుంది అమీ జాక్సన్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English