మహేష్ కత్తికి ఓ అభిమాని ఏడు ప్రశ్నలు

మహేష్ కత్తికి ఓ అభిమాని ఏడు ప్రశ్నలు

మొన్నటిదాకా ఒక లెక్క. పవన్ కళ్యాణ్ అభిమానులతో పోరులో మహేష్ కత్తి హద్దుల్లో ఉన్నట్లే కనిపించాడు. అతడికి నేరుగా ఎవరూ మద్దతివ్వకపోయినా.. అతడి పోరాటం కరెక్టే అని అభిప్రాయపడిన వాళ్లు చాలామందే ఉన్నారు. ఐతే పూనమ్ కౌర్ తన పేరు ఎత్తకపోయినా సరే తననే ఆమె బూతులు తిట్టిందంటూ ఫైర్ అయిపోయిన కత్తి.. ఆమె మీద సంచలన ఆరోపణలతో మీడియా ముందుకొచ్చాడు. ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలు చూపించకుండా ఈ ఆరోపణలు చేశాడు. ఆ సందర్భంగా విలేకరులు అడిగిన కొన్ని ప్రశ్నలకు పెడసరంగా సమాధానాలు చెప్పాడు.

దీంతో కత్తి శ్రుతి మించుతున్నాడన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో సామాజిక మాధ్యమాల్లో పవన్ అభిమానులు, మద్దతుదారుల దాడి మరింత పెరిగిపోయింది.
ఇలాంటి తరుణంలోనే ఓ టీవీ ఛానెల్ చర్చలో భాగంగా వివేక్ అనే దర్శకుడు మీ తల్లి గురించి రెండు నిమిషాలు మాట్లాడదామా అంటే.. కుదరదనేశాడు కత్తి. ఆయన ఆ విషయంలో పట్టుబట్టేసరికి సైలెంటైపోయిన కత్తి.. కొన్ని నిమిషాల తర్వాత ఆ చర్చ నుంచి లేచి వెళ్లిపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే ఒక అభిమాని కత్తి కుటుంబం నుంచి సందేహాలు రేకెత్తిస్తూ.. కత్తి సంధించినట్లే ప్రశ్నలు సంధించడం విశేషం. ఆ ప్రశ్నలు ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఇంతకీ ఆ ప్రశ్నలేంటంటే..

1. నీ తండ్రి వ్యవసాయాధికారిగా ఎన్ని కోట్లు లంచాలు మింగాడు?

2. నీ కుటుంబం గ్రామానికి ఎందుకు రాదు?

3. బిగ్ బాస్ షోలో ఎంట్రీకి నిన్ను అంబటి రాంబాబు ఎందుకు రెకమండ్ చేశాడు?

4. నువ్వు పవన్‌ను టార్గెట్ చేసేందుకు వైసీపీ ఎంత ముట్టజెప్పింది?

5. వాయల్పాడు రైతులను చిట్టీల పేరుతో నీ తల్లి మోసం చేసింది ఎందుకు?

6. నీ సోదరి భర్తను బెదిరించి డబ్బులు గుంజడానికి ఎవరు సహాయం చేశారు?

7. నీ కుటుంబం ఏ తప్పూ చేయకపోతే సంక్రాంతికి ఎందుకు గ్రామానికి రావు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు