మెగా హీరో ప్లానింగ్‌ అదుర్స్‌

మెగా హీరో ప్లానింగ్‌ అదుర్స్‌

మెగా హీరోల్లో వరుణ్‌ తేజ్‌ ప్రోగ్రెస్‌ స్లోగానే వుంది కానీ ఆది నుంచి అతని ప్లానింగ్‌ బాగుంది. డాన్స్‌లు, ఫైట్లు చేసి ఫాన్స్‌ని అలరించే విషయంలో తనకి కొన్ని లిమిటేషన్స్‌ వున్నాయి. దీంతో అనుభవజ్ఞులు, సెన్సిటివ్‌ దర్శకులు అయిన వారితో వరుణ్‌ తేజ్‌ సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

మొదట అనుకున్నవి తిరగబడినా కానీ ఫిదాతో బ్లాక్‌బస్టర్‌ కొట్టేసాడు. ఆ చిత్రానికి సాయి పల్లవి ఎక్కువ క్రెడిట్‌ కొట్టిందనేది కూడా వరుణ్‌ రియలైజ్‌ అయ్యాడు. అందుకే ఫిదా బ్లాక్‌బస్టర్‌ చూసి రాంగ్‌ స్టెప్‌ వేయకుండా తన లిమిట్స్‌లోనే వున్నాడు. ఇంకా తనకి సూటయ్యే సినిమాలే చేస్తూ నెమ్మదిగా రేంజ్‌ పెంచుకునే పనిలో వున్నాడు. తొలిప్రేమ చిత్రం ఇప్పటికే బాగా ఆకర్షిస్తోంది. ఈ చిత్రాన్ని అవుట్‌రైట్‌గా దిల్‌ రాజు కొనేయడంతో మరింత క్రేజ్‌ వచ్చింది.

అనిల్‌ రావిపూడి తీయబోతున్న మల్టీస్టారర్‌ చిత్రంలో నటించడానికి చాలా మంది హీరోలు వెనకాడారు. వెంకటేష్‌తో కలిసి ఈ చిత్రంలో నటించడానికి వరుణ్‌ తేజ్‌ వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసాడు. ఈ చిత్రంలో తన రోల్‌ లెంగ్త్‌ ఏమిటి, వగైరా ఏమీ ఆలోచించకుండా తనకి రీచ్‌ పెంచే చిత్రమవుతుందని వరుణ్‌ ఈ చిత్రం సైన్‌ చేసాడు. తనతో పని చేసిన నిర్మాతలందరితోను వరుణ్‌ తేజ్‌ మంచి సంబంధాలు మెయింటైన్‌ చేస్తున్నాడు. తనతో సినిమా తీసిన ప్రతి నిర్మాతకీ వరుణ్‌ అడగంగానే డేట్స్‌ ఇచ్చేస్తూ నిర్మాతల హీరో అనిపించుకుంటున్నాడు. గుడ్‌విల్‌తో పాటు టాలెంట్‌ కూడా వుండడంతో వరుణ్‌ తేజ్‌ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌ కేక్‌ అయ్యాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు