దిల్‌ రాజు అస్త్రం వాడుతున్న రవితేజ?

దిల్‌ రాజు అస్త్రం వాడుతున్న రవితేజ?

రవితేజ 'టచ్‌ చేసి చూడు' చిత్రం సంక్రాంతికి రావాల్సింది కానీ ఫిబ్రవరికి వాయిదా వేసారు. రవితేజకి 'రాజా ది గ్రేట్‌'తో బాగా సన్నిహితమైన దిల్‌ రాజు సలహా మేరకే ఈ పని చేసారట. సంక్రాంతి సీజన్‌ రవితేజకి కలిసి వచ్చిందే అయినప్పటికీ థియేటర్లు దొరకని పరిస్థితుల్లో, పోటీ తీవ్రంగా వున్న టైమ్‌లో ఇంత బడ్జెట్‌ పెట్టిన సినిమా విడుదల చేయడం మంచిది కాదని దిల్‌ రాజు చెప్పాడట.

రాజా ది గ్రేట్‌ చిత్రానికి కూడా దిల్‌ రాజు సేమ్‌ థియరీ పాటించాడు. దసరా బరిలోంచి తప్పించి, దీపావళికి సినిమా విడుదల చేసి రాజు సేఫ్‌ అయ్యాడు. దీంతో రవితేజ అతని మాట ప్రకారం ఫిబ్రవరికి వాయిదా వేయించాడట. అయితే ఫిబ్రవరిలో కూడా రష్‌ ఎక్కువ వుండడం, జనవరి నెలాఖరులో కూడా పలు చిత్రాలు విడుదల అవుతూ వుండడంతో రవితేజ కాస్త వర్రీ అవుతున్నాడట.

దిల్‌ రాజు అస్త్రాన్ని వాడబోతున్నాడని, అతని సాయం తీసుకుని వీలయినన్ని థియేటర్లు సాధించడానికి చూస్తున్నాడని, టచ్‌ చేసి చూడు బయ్యర్లు ఇప్పుడు దిల్‌ రాజు టచ్‌లో వున్నారని, ఈ చిత్రానికి దిల్‌ రాజు ఫుల్‌ సపోర్ట్‌ ఇస్తున్నాడని సమాచారం. రాజా ది గ్రేట్‌ తర్వాత మరో చిత్రం చేయడానికి కూడా రాజుకి రవితేజ డేట్స్‌ ఇచ్చేసాడు. కాకపోతే అవి వచ్చే ఏడాది వాడుకోవాలని రాజు డిసైడ్‌ అయ్యాడు. హరీష్‌ శంకర్‌ 'దాగుడుమూతలు' తర్వాత చేసే చిత్రం రవితేజతో వుండొచ్చునని వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు