పవన్ పుణ్యం.. 2018లోనూ జనాలంతే!

పవన్ పుణ్యం.. 2018లోనూ జనాలంతే!

రోజులు మారిపోతూనే ఉన్నాయి. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక.. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు.. వాటిలోకి 4జీ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత.. మరీ నైసుగా మారిపోయారు జనాలు. ఈ స్మార్ట్ ట్రెండ్ సినిమా టికెట్స్ విషయంలో కూడా అప్లై అయిపోతోంది. మండల కేంద్రాల వంటి సెంటర్స్ మినహాయిస్తే.. చెప్పుకోదగిన టౌన్స్ లో ఆన్ లైన్ టికెటింగ్ అందుబాటులోకి వచ్చింది.

ముందే టికెట్స్ కన్ఫాం చేసుకోవడం.. టికెట్స్ దొరికిన వాళ్లే థియేటర్స్ కు రావడం లాంటి కారణాలతో సినిమా థియేటర్ల దగ్గర టికెట్స్ కోసం జనాలు క్యూలు కట్టడం లాంటివి కనిపించడం లేదు. పైగా 2018లో కూడా ఇంకా ఇలాంటివి చూడాలని అనుకోవడం అత్యాశే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూవీతో లెక్కలు మారిపోయేటట్లు ఉన్నాయి. 2018వచ్చినా మన ఆడియన్స్ కు అల్టిమేట్ ఎంటర్టెయిన్మెంట్ సినిమాలే అనే విషయం తేలిపోతోంది. స్టార్ హీరోల సినిమాలు వస్తుంటే.. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా ఉండడం మామూలే.

కానీ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రం రిలీజ్ కి వారం ముందే అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేయగా.. ఇలా థియేటర్లు ఓపెన్ చేయడం.. అలా పూర్తయిపోవడం జరుగుతోంది. మిలీనియం ఇయర్ లో పుట్టిన జనాలకు కూడా ఓటు హక్కకు ఎలిజిబిలిటీ వచ్చేస్తోంది. అయినా.. ఇప్పటికీ ఓ హీరోను ఆరాధించడం.. అభిమానించడం అంటే ఎలా ఉంటుందో అనే లెక్కను పక్కాగా చెప్పేందుకు నిదర్శనంగా ఉంది అజ్ఞాతవాసి క్రేజ్. నాలుగు రోజులకు ముందే ఇంత హంగామా నడుస్తుంటే.. ఇక రిలీజ్ రోజు పరిస్థితి ఊహించుకుంటేనే.. ఆశ్చర్యం వేయక మానదు. ఏమైనా మన జనాలకు సినిమా అంటే మహా పిచ్చి బాబూ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు