ఈ టీజర్లో తమన్ వినిపించాడేమిటబ్బా?

ఈ టీజర్లో తమన్ వినిపించాడేమిటబ్బా?

ఈ మధ్యే ‘రాజా ది గ్రేట్’తో రీఎంట్రీ ఇచ్చాడు మాస్ రాజా రవితేజ. ఆ సినిమా బాగానే ఆడింది. రవితేజ కెరీర్‌కు ఊపునిచ్చింది. ఇప్పుడు మాస్ రాజా కొత్త సినిమాతో రెడీ అయిపోతున్నాడు. విక్రమ్ సిరి అనే కొత్త దర్శకుడితో అతను చేసిన ‘టచ్ చేసి చూడు’ త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ రోజే ఈ చిత్ర టీజర్ లాంచ్ అయింది. అందులో కొత్తగా చూపించిందేమీ లేదు. మాస్ రాజా మాస్ అవతారంలో కనిపించిన ఒక షాట్‌తో టీజర్ ముగించారు. ఈ టీజర్‌లో హెవీగా, మాస్‌గా అనిపించే బ్యాగ్రౌండ్ స్కోర్ వినిపించింది. ఐతే ఆ సౌండ్స్ అవీ వింటున్నపుడు ‘సరైనోడు’ టీజర్ గుర్తుకొచ్చి ఉంటే ఆశ్చర్యమేమీ లేదు.

అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘సరైనోడు’ టీజర్లో తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా హైలైట్ అయింది. దాదాపుగా అదే సౌండుతో మొదలైంది ‘టచ్ చేసి చూడు’ టీజర్. దీని చివర్లో కూడా అదే సౌండ్ వినిపించింది. మామూలుగా తమన్‌కు అక్కడా ఇక్కడా మ్యూజిక్ కాపీ చేస్తాడన్న విమర్శలున్నాయి. అలాంటిది అతడి సౌండ్స్‌ను వేరొకరు అనుకరించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ‘టచ్ చేసి చూడు’కు సంగీతాన్నందిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ మామూలోడు కాదు. బాలీవుడ్లో పేరుమోసిన సంగీత దర్శకుడైన ప్రీతమ్ ఈ చిత్రంతోనే తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. మరి అతను యాదృచ్ఛికంగా టీజర్‌కు ఇలా మ్యూజిక్ ఇచ్చాడా లేక తమన్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యాడా అన్నది చిత్ర బృందానికే తెలియాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు