అజ్ఞాతవాసి ప్రీమియర్లకు కుర్రస్టార్ల హడావిడి

అజ్ఞాతవాసి ప్రీమియర్లకు కుర్రస్టార్ల హడావిడి

టాలీవుడ్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు మొత్తం ఇప్పుడు అజ్ఞాతవాసి కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ 25వచిత్రంగా రూపొందిన ఈ మూవీ.. పవర్ స్టార్ ఆఖరి చిత్రం అనే ప్రచారం జరగడం.. త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందడం.. రీసెంట్ గా విడుదల చేసిన కొడకా కోటేశ్వరరావా పాట ఛార్ట్ బస్టర్ గా నిలవడం వంటివి మూవీకి అదనపు అసెట్స్.

అన్నిటికంటే మించి పవన్ కళ్యాణ్ సినిమా అన్నదే అసలు సిసలైన అట్రాక్షన్. ఈ సినిమాకి సాధారణ ఫ్యాన్స్ తో పాటు.. సెలబ్రిటీల్లో కూడా హంగామా బాగానే నడుస్తోంది. పలువురు యంగ్ హీరోలు తాము పవన్ కి ఎంతటి అభిమానులం అని ఓపెన్ గానే చెప్పేశారు. వీరిలో నితిన్.. నిఖిల్ వంటి వారిని ప్రముఖంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం యూఎస్ టూర్ లో ఉన్న నిఖిల్.. పవన్ కళ్యాణ్ మూవీ అజ్ఞాతవాసిని అక్కడే చూడాలని ఫిక్స్ అయిపోయాడట. 9వ తేదీన యూఎస్ లో ప్రీమియర్ షోస్ టెలికాస్ట్ కానున్న సంగతి తెలిసిందే. అక్కడే పవన్ మూవీ చూసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడట.

ఒక్క నిఖిల్ మాత్రమే కాదు.. శర్వానంద్.. వరుణ్ తేజ్.. సాయిధరం తేజ్.. నితిన్.. లాంటి ఇతర యంగ్ హీరోలు కూడా ఇదే టైపులో ఇక్కడ ప్రీమియర్స్ కు ప్రిపేర్ అయిపోతున్నారట. హైద్రాబాద్ లో కూడా ముందు రోజున ప్రీమియర్ షోలకు అనుమతులు వచ్చాయనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలుసు కదా!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు