సినిమాలు పక్కనోళ్ల పిల్లలకేనట!

సినిమాలు పక్కనోళ్ల పిల్లలకేనట!

బాలీవుడ్ లో నెపోటిజం గురించి జరిగినంత.. జరుగుతున్నంత రాద్ధాంతం మరే అంశంపైనా ఉండదని చెప్పచ్చు. ఇలా వారసులను ఇండస్ట్రీలోకి తీసుకురావడానికి టార్చ్ బేరర్ గా దర్శక నిర్మాత కరణ్ జోహార్ పై చాలానే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు తగినట్లుగానే ఆయన చర్యలు కూడా ఉంటాయి.

ఇప్పటికే చాలామంది వారసులను వెండితెరపైకి తెచ్చిన కరణ్ జోహార్.. ఇప్పుడు శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ను కూడా పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈయన రీసెంట్ గా మాట్లాడిన మాటలు చూస్తే.. ఇలా వారసులను సినిమాల్లోకి తేవడం అన్నది ఇతరుల పిల్లలకే పరిమితమా.. సొంత పిల్లలకు వేరే రూల్స్ ఉంటాయా అనిపించక మానదు. 'నేను నా పిల్లలను సినిమా సెట్స్ పై పెంచాలని అనుకోవడం లేదు. ముందు నుంచే ఈ వాతావరం అలవాటు చేసేసి.. ఈ రంగాన్ని వారిపై బలవంతంగా రుద్దాలని అనుకోవడం లేదు. వారి సొంత నిర్ణయాలు వారే తీసుకోవడాన్ని ప్రోత్సహిస్తాను' అని చెబుతున్నాడు కరణ్ జోహార్.

నిజానికి సినిమా వాళ్లంతా ఇలాంటి కబుర్లనే వల్లె వేస్తుంటారు. తీరా చివరకు వాళ్లే దగ్గరుండి మరీ జాగ్రత్తలు తీసుకుని సినిమాల్లోకి తీసుకొస్తారు. ఇంతకీ కరణ్ ఇంతగా తన పిల్లల గురించి చెబుతున్నాడు కదా అని.. వారేం కాస్త వయసులోకి వచ్చినవారు కాదని తెలుసుగా. గతేడాది మార్చ్ లో సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు కరణ్ జోహార్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు