సునీల్‌కి డే అండ్‌ నైట్‌ అదే పని!

సునీల్‌కి డే అండ్‌ నైట్‌ అదే పని!

భీమవరం బుల్లోడు అయిన సునీల్‌ ఇప్పుడు అదే పేరుతో సినిమా చేస్తున్నాడు. హీరోగా సక్సెస్‌ అయిన తర్వాత కామెడీ వేషాలు పూర్తిగా మానేసి హీరోగానే కంటిన్యూ అవుతున్న సునీల్‌ గత చిత్రం 'మిస్టర్‌ పెళ్లికొడుకు' ఆడలేదు. ఆ నష్టాన్ని 'తడాఖా' కొంతవరకు భర్తీ చేసినా కానీ 'భీమవరం బుల్లోడు' చిత్రంపై సునీల్‌ భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పవచ్చు. కమెడియన్లు హీరోలుగా కొన్ని చిత్రాలు చేసి సక్సెస్‌ అయినా ఆ తర్వాత మళ్లీ తిరస్కరణకి గురయ్యారు. సునీల్‌ కూడా అలాగే అవుతాడని కొందరు భావిస్తున్నారు. కానీ తన డాన్సులతో, సిక్స్‌ ప్యాక్‌ బాడీతో హీరోగానే కొనసాగాలని సునీల్‌ గట్టిగా ట్రై చేస్తున్నాడు.

ఇందుకోసం అతను నిరంతరం విజయాలు సాధిస్తుండాలి. భీమవరం బుల్లోడు కనుక అంచనాలు అందుకోకపోతే అతనిపై ఆసక్తి అందరికీ తగ్గుతుంది. అందుకే దీని విషయంలో అతను చాలా జాగ్రత్త పడుతున్నాడు. రాత్రింబవళ్లు ఈ చిత్రం కోసం విపరీతంగా కష్టపడిపోతున్నాడు. ఈ చిత్రాన్ని సురేష్‌బాబు నిర్మిస్తున్నారు. కలిసుందాం రా దర్శకుడు ఉదయ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. చూద్దాం... భీమవరం బుల్లోడి అదృష్టం ఎలాగుందో?

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English