ఇన్ని కలిసొచ్చాయ్.. పవన్ కొడతాడా?

ఇన్ని కలిసొచ్చాయ్.. పవన్ కొడతాడా?

రికార్డులు వస్తూ ఉంటాయ్.. వాటిని బద్దలు కొడుతూ కొత్తవి నమోదవుతూనే ఉంటాయి. అయితే.. బాహుబలి ది కంక్లూజన్ సాధించిన రికార్డులను ఇప్పట్లో టచ్ చేయడం కష్టం అని అంతా అంచనా వేస్తున్నారు. ఇప్పుడప్పుడే రాజమౌళి కూడా వీటిని టచ్ చేయడం క్లిష్టమే అన్నది పలువురి వాదన.

అయితే.. ఓవరాల్ రికార్డుల సంగతేమో కానీ.. బాహుబలి2 రికార్డులను పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి బద్దలు కొట్టేందుకు అన్ని అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ జనాలు చెబుతున్నారు. ప్రీమియర్లతోనే 2.5 మిలియన్ డాలర్లను గడించిన ఘనత బాహుబలి2ది. దానికి మించి అజ్ఞాతవాసిని ప్రదర్శిస్తున్నారు. యూఎస్ లో 457 సెంటర్లలో ప్రీమియర్లు పడుతున్నాయి. ఇప్పటికే అన్ని సెంటర్లలోను టికెట్స్ సేల్ అయిపోయాయని చెబుతున్నారు. అంటే బాహుబలి2 రికార్డును దాటేయడం ఖాయమే అన్నది పలువురి వాదన. మరోవైపు తెలుగు రాష్ట్రాలలో కూడా మొదటి రెండు రోజుల పాటు 95 శాతం థియేటర్లలో అజ్ఞాతవాసి ప్రదర్శించే అవకాశాలున్నాయి.

మరోవైపు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు కూడా అనుమతులు వచ్చేశాయి. ప్రీమియర్లను కూడా ప్రదర్శించుకునే అవకాశం లభించేసింది. ఇన్ని సిట్యుయేషన్స్ కలిసొచ్చిన పరిస్థితిల్లో.. పవన్ కళ్యాణ్ మూవీ అజ్ఞాతావాసి చిత్రం.. బాహుబలి2 ప్రీమియర్ల రికార్డును.. తొలి రోజు వసూళ్ల రికార్డు అయిన 43 కోట్ల షేర్ ను అధిగమించడం అంత కష్టమేమీ కాకపోవచ్చని చెబుతున్నారు. మరి పవన్ ఇవన్నీ బద్దలుకొడతాడో లేదో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English