గరుడవేగ డైరెక్టర్ నోరు జారి..

గరుడవేగ డైరెక్టర్ నోరు జారి..

ప్రతిభ ఉన్న చోట ఆత్మవిశ్వాసం ఉండటం సహజం. ఐతే కొన్నిసార్లు అది అతి విశ్వాసంగానో.. పొగరుగానో మారుతూ ఉంటుంది. ఆ క్రమంలో ఆ ప్రతిభావంతులు కూడా నోరు జారేసి వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. ‘ఎల్బీడబ్ల్యూ’ లాంటి విభిన్నమైన సినిమాతో మొదలుపెట్టి.. సినిమా సినిమాకూ వైవిధ్యం చూపిస్తూ సాగుతున్న యువ దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఇంతకుముందు ‘చందమామ కథలు’ సినిమాకు జాతీయ అవార్డు వచ్చిన సమయంలో రివ్యూయర్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ఐతే రివ్యూయర్లను తిట్టడం అందరికీ అలవాటే కాబట్టి.. వాళ్ల సంఖ్య తక్కువ కాబట్టి మరీ ఎక్కువ ఇబ్బందేమీ లేకపోయింది.

కానీ ‘గరుడవేగ’ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంలో ఉన్న ప్రవీణ్.. ఇప్పుడు లక్షలమందిని అవమానించేలా వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే కత్తి మహేష్ ఆధ్వర్యంలో జరిగిన డైరెక్టర్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రవీణ్ మాట్లాడుతూ.. ఎన్నారైలు పైరసీని బాగా ప్రోత్సహిస్తారని అన్నాడు. ఫ్రైడే నైట్ ఐదు డాలర్లు పెట్టి పిజ్జా కొంటారని.. పైరసీ ప్రింట్ డౌన్ లోడ్ చేస్తారని.. ఆపై తమ మిత్రులందరినీ పిలిచి అందరికీ సినిమా చూపిస్తారని అన్నాడు. ఎన్నారై తెలుగు ఆడియన్స్ ‘నొటోరియస్’ అంటూ ఆ పదాన్ని ఒకటికి రెండుసార్లు వాడాడు ప్రవీణ్. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. దీని గురించి సోషల్ మీడియాలో చర్చ జరగడంతో ఎన్నారై తెలుగు ప్రేక్షకుల వరకు విషయం వెళ్లింది. దీంతో వాళ్లు ప్రవీణ్ సత్తారును ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ప్రవీణ్ లేటెస్ట్ మూవీ ‘గరుడవేగ’ తెలుగు రాష్ట్రాల్లో ఫ్లాప్ కాగా.. యుఎస్ లో హిట్ చేసింది ఎన్నారై ప్రేక్షకులే మరి. వారినుద్దేశించి ప్రవీణ్ ఇలా వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సబబన్నది ప్రశ్న.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు