వై బన్నీ-చెర్రీ.. వై నాట్ ఎన్టీఆర్?

వై బన్నీ-చెర్రీ.. వై నాట్ ఎన్టీఆర్?

ఈ సంక్రాంతికి పోటీ పడుతున్న సినిమాల్లో నందమూరి బాలకృష్ణ నటించిన జైసింహా కూడా ఉంది. సంక్రాంతి హీరోగా బోలెడంత గుర్తింపు ఉన్న బాలయ్య.. మళ్లీ తన సినిమాను లైన్ లో పెట్టేశారు. పవర్ ఫుల్ క్యారెక్టర్లో బాలయ్య నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. జైసింహా నిర్మాత సి.కళ్యాణ్ మూవీపై మహా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అందుకే టోటల్ గా తనే రిలీజ్ చేసుకోవడం విశేషం.

ప్రమోషన్స్ లో కూడా యాక్టివ్ గా పాల్గొంటున్న ఈ ప్రొడ్యూసర్.. సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారు. జై సింహా మూవీలో యాక్షన్ పార్ట్ మాత్రమే కాదు.. స్టెప్పులు కూడా హైలైట్ అంటున్నారీయన. అంతే కాదు.. 'ప్రస్తుతం బన్నీ.. చెర్రీ ఎలాంటి స్టెప్పులు వేస్తున్నారో.. అందుకు ధీటుగా బాలయ్య డ్యాన్స్ ఉంటుంది. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యాన్సులు చూసి అందరూ ఆశ్చర్యపోతారు' అని చెబుతున్నారు నిర్మాత సి. కళ్యాణ్. అది సరే కానీ.. నందమూరి హీరోల్లోనే ఎన్టీఆర్ లాంటి సూపర్ డ్యాన్సర్ ఉండగా.. మెగా హీరోలతో పోల్చడం ఎందుకో అర్ధం కాని విషయం.

ప్రస్తుత జనరేషన్ హీరోల్లో సూపర్ డ్యాన్సర్ అంటే.. మొదటగా వినిపించే పేరు ఎన్టీఆర్. అయినా సరే.. కళ్యాణ్ మాత్రం బాలయ్యను మెగా హీరోలతో పోల్చడం ఆశ్చర్యకరం. అనవసర వివాదాలు కొని తెచ్చుకోవడం ఎందుకు అనుకున్నారో.. లేక డ్యాన్సుల్లో మెగా హీరోలే ముందు అని ఫీలయ్యారో తెలియదు కానీ.. నిర్మాత సి కళ్యాణ్ చెప్పిన మాటలు.. జనాలకు రకరకాలుగా అర్ధమవుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు