అప్పుల్లో ఉన్నా బికినీ ఫోటోలు వదల్లేదు

అప్పుల్లో ఉన్నా బికినీ ఫోటోలు వదల్లేదు

మన దేశంలో స్కాములు చేసేవాళ్లకు ఏ మాత్రం కొదువ లేదు. వందలు వేల కోట్లను కొట్టేసి నింపాదిగా కులాసాగా గడిపేస్తున్న వారు చాలామందే ఉంటారు. కానీ అందరి పరిస్థితి ఒకటైతే.. విజయ్ మాల్యా మాత్రం ఇండియా వదిలేసి పారిపోవాల్సి వచ్చింది. బ్యాంకులను ముంచేసిన స్కామ్ లో భాగంగా విజయ్ మాల్యాపై చాలానే ఆరోపణలున్నాయి.

అయితే.. ఏ స్కామ్ కి రానంత వ్యూయర్స్ ఫాలోయింగ్.. మీడియా ప్రచారం విజయ్ మాల్యాకు దక్కాయి. ఇంతకీ అసలు ఈయనకు ఎందుకంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఎవరికైనా అర్ధం కాకపోతే.. ఇప్పుడు కింగ్ ఫిషర్ క్యాలెండర్ చూస్తే అప్పుడు గ్యారంటీగా అర్ధమవుతుంది. తను దేశం కాని దేశంలో తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చినా.. ఇండియాలో అడుగు పెడితే జైల్లో ఉండాల్సిన సిట్యుయేషన్ లో కూడా.. తన రసాస్వాదన ఏ మాత్రం తగ్గించుకోలేదు ఈ లిక్కర్ కింగ్. ఎప్పటిమాదిరిగానే ఈ ఏడాది కూడా అందాల భామలతో కింగ్ ఫిషర్ క్యాలెండర్ రిలీజ్ చేశాడు. ప్రతీ ఏటా టాప్ మోడల్స్ అందాలను వయ్యారంగా బైటపెట్టే ఈ క్యాలెండర్.. ఈ ఏడాది కూడా వచ్చేసింది.

ఇంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఇంకెవరైనా అయితే... క్యాలెండర్ విషయంలో వెనక్కి తగ్గేవారే. కానీ విజయ్ మాల్యా మాత్రం మోడల్స్ కౌంట్ తగ్గించినా.. ఆనవాయితీ ప్రకారం అందాల కింగ్ ఫిషర్ క్యాలెండర్ వదిలేశారు. అందుకే కదా.. ఆయనకు అంత ఫాలోయింగ్!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English