ఎడారిలో ప్రయాణం.. పాపకు హిట్టిస్తుందా?

ఎడారిలో ప్రయాణం.. పాపకు హిట్టిస్తుందా?

అందాల రాక్షసి లావణ్య త్రిపాఠికి గతేడాది ఏ మాత్రం కలిసి రాలేదని చెప్పాలి. అంతకు ముందు సంవత్సరం వరుస హిట్స్.. బ్లాక్ బస్టర్స్ తో అందరినీ తెగ మెప్పించేసిన ఈ భామ.. గతేడాది మాత్రం బాగా వెనకబడిపోయింది. ఒక్కటంటే ఒక్క సినిమాతో కూడా హిట్ కొట్టలేకపోయింది. లావణ్య త్రిపాఠి అశలు పెట్టుకున్న హీరోలు అందరూ వమ్ము చేసేశారు.

మిస్టర్ మూవీతో వరుణ్ తేజ్.. రాధ చిత్రంతో శర్వానంద్.. యుద్ధం శరణంతో నాగ చైతన్య.. ఉన్నది ఒకటే జిందగీతో రామ్.. ఇలా ప్రతీ ఒక్కరూ లావణ్యను డిజప్పాయింట్ చేశారు. మాయావన్ ఒక్కటే కాసింత నయం అనిపించుకుంది. ఈ ఏడాది కూడా వరుస సినిమాలతో ఆడియన్స్ ముందుకు రానుంది లావణ్య. మొదటగా సాయిధరం తేజ్ తో కలిసి ఇంటెలిజెంట్ మూవీతో పలకరించనున్న ఈ భామ.. ప్రస్తుతం ఎడారి దేశాల్లో చక్కర్లు కొడుతోంది. వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్నఈ చిత్రం కోసం.. ప్రస్తుతం పాటల చిత్రీకరణ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ అంతా వరుస ఎదురుదెబ్బలు తిన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ఎడారి ప్రయాణంతో కొత్త ఏడాదిని స్టార్ట్ చేసింది.

గతంలో మాదిరిగా నిండుగా కప్పుకునే పద్ధతైన పాత్రలలో కాకుండా.. ఈ సారి గ్లామర్ యాంగిల్ ట్రై చేస్తోంది లావణ్య త్రిపాఠి. షార్ట్ డ్రెస్సులు.. స్లీవ్ లెస్ లతో తనలోని అందాలను ఎగ్జిబిట్ చేసేస్తూ.. ఎడారి ప్రయాణంతో అదృష్టం పరీక్షించుకుంటున్న లావణ్య హిట్టు ఆశలు నెరవేర్చేదెవరో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు