పొల్లాచ్చి లో చిరంజీవితో రొమాన్స్

పొల్లాచ్చి లో చిరంజీవితో రొమాన్స్

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి షూటింగ్ ప్రారంభించుకోవడమే కాదు.. తొలి షెడ్యూల్ ను కూడా పూర్తి చేసేసుకుంది. మొదటగా యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణతో షూటింగ్ ఆరంభించిన దర్శకుడు సురేందర్ రెడ్డి.. ఇప్పుడు రెండో షెడ్యూల్ కు ప్రిపేర్ అయిపోతున్నాడు.

సైరా సెకండ్ షెడ్యూల్ ను పొల్లాచ్చిలో ప్లాన్ చేశారట యూనిట్. త్వరలోనే టీం అంతా తమిళనాడు బయల్దేరేందుకు సిద్ధం అవుతున్నారట కూడా. మొదట యాక్షన్ పై దృష్టి పెట్టిన దర్శకుడు.. ఇప్పుడు ఫ్యామిలీ.. ఎమోషన్ కు సంబంధించిన సన్నివేశాలు తెరకెక్కించనున్నాడట. ఈ షెడ్యూల్ లో పలు కీలక సన్నివేశాలతో పాటు పాటల చిత్రీకరణ కూడా చేస్తారని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ లో సౌత్ బ్యూటీ నయనతార కూడా షూటింగ్ లో పాల్గొనుంది. మెగాస్టార్ తో కలిసి తొలిసారి నటించేందుకు సిద్ధమవుతున్న నయన్.. బోలెడంత ఎగ్జైట్మెంట్ కు గురవుతోంది. చిరంజీవితో కలిసి కొన్ని రొమాంటిక్ సీన్స్ లో కూడా నయనతార యాక్ట్ చేయబోతోందని తెలుస్తోంది.

టాలీవుడ్ చరిత్రలోనే భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. కన్నడ స్టార్ సుదీప్.. తమిళ హీరో విజయ్ సేతుపతితో పాటు.. జగపతి బాబు కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు