హీరోయిన్లకి డబ్బులు విసిరేస్తున్నాడు

హీరోయిన్లకి డబ్బులు విసిరేస్తున్నాడు

చేతిలో డబ్బులుంటే కొండ మీది కోతిని అయినా దించవచ్చుననేది సామెత. డబ్బులుండాలే కానీ ఎంతటి స్టార్‌ హీరోయిన్‌తో అయినా సరసాలు ఆడవచ్చునని నిరూపిస్తున్నాడీ నిర్మాత. టాలెంట్‌ సున్నా అయినా, లుక్స్‌ అంతంత మాత్రమే అయినా కానీ తమిళ నిర్మాత ఉదయనిధి స్టాలిన్‌ హీరో అయిపోయాడు. తనని చూడ్డానికి ప్రేక్షకులు రారనే సంగతి ముందే పసిగట్టిన ఉదయనిధి జనాన్ని ఆకట్టుకోవడానికి స్టార్‌ హీరోయిన్లని నమ్ముకుంటున్నాడు.

హీరో ఎవరైనా కానీ హీరోయిన్‌ బాగుంటే తప్పకుండా వస్తారని నమ్ముతున్న ఉదయనిధి స్టాలిన్‌ వరుసగా అందాల భామలతో, అందునా టాప్‌ హీరోయిన్లతో నటిస్తూ నెట్టుకొచ్చేస్తున్నాడు. తమిళ జనానికి మత్తెక్కిస్తున్న హన్సికకి జత కట్టి హిట్టు కొట్టేసిన ఉదయనిధి ప్రస్తుతం అగ్ర నటి నయనతారతో రొమాన్స్‌ చేస్తున్నాడు. తన తదుపరి చిత్రంలో కాజల్‌ని కథానాయికగా ఎంపిక చేసుకున్నాడు. ఇలా వరుస పెట్టి స్టార్‌ హీరోయిన్ల డేట్స్‌ సంపాదించి హీరోగా సెటిల్‌ అయిపోవాలని చూస్తున్నాడు. ఇతని పక్కన నటిస్తే రెండు సినిమాలకి వచ్చే డబ్బులు ఒకేసారి వస్తాయని హీరోయిన్లు కూడా సై అనేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు