దిల్‌ రాజు డైరెక్టర్లకి ఒరిగేదేంటి?

దిల్‌ రాజు డైరెక్టర్లకి ఒరిగేదేంటి?

ఏడాదిలో ఆరు సినిమాలు తీసాను, డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించాను అంటూ దిల్‌ రాజు గొప్పగా చెప్పుకుంటున్నాడు. అయితే అతను తీసిన ఆ ఆరు సినిమాల్లో నిజంగా దర్శకులకి పేరు తెచ్చి పెట్టినవి ఎన్ని? ఫిదా చిత్రంపై శేఖర్‌ కమ్ముల ముద్ర బలంగా వుంది. ఆ చిత్రానికి నిర్మాత దిల్‌ రాజు అయినప్పటికీ అతని మార్కు కమర్షియల్‌ హంగులేమీ లేకుండా కొత్త తరహా అనుభూతితో అలరించింది.

అది మినహాయిస్తే రాజు బ్యానర్‌ నుంచి వచ్చిన సినిమాలన్నీ కూడా సగటు కమర్షియల్‌ చిత్రాలే. శతమానం భవతి రొటీన్‌ ఫ్యామిలీ డ్రామాతో కూడిన సినిమా కాగా, నేను లోకల్‌, ఎంసిఏ రెండూ కూడా రొటీన్‌ కమర్షియల్‌ టెంప్లేట్‌ సినిమాలే. డిజెలో హీరోని బ్రాహ్మణుడిగా, రాజా ది గ్రేట్‌లో హీరోని అంధుడిగా చూపించడం మినహా కొత్తదనం ఏమీ అందించలేదు. కమర్షియల్‌గా ఈ సినిమాలతో దిల్‌ రాజు సేఫ్‌ అయిపోయినా కానీ దర్శకులుగా వీరిలో ఎవరైనా బలమైన ముద్ర వేసారా అంటే లేదు.

సదరు దర్శకులందరి తదుపరి చిత్రాలని దిల్‌ రాజు నిర్మించబోతున్నాడు. నిర్మాతగా తన సేఫ్టీ చూసుకుంటోన్న దిల్‌ రాజు దర్శకుల కొత్త ఆలోచనలని ప్రోత్సహించడం లేదు. ఒకప్పుడు బొమ్మరిల్లు, ఆర్య లాంటి ఐడియాలని ఎంకరేజ్‌ చేసిన దిల్‌ రాజు ఇప్పుడు మరీ సేఫ్‌ ప్లేయర్‌ అయిపోయి తన డబ్బుని కాపాడుకుంటున్నా కానీ దర్శకులకి మాత్రం ఆ సినిమాలతో ఏమీ ఒరగడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు