అల్లు వారి ప్లాన్‌ రివర్స్‌ అయింది

అల్లు వారి ప్లాన్‌ రివర్స్‌ అయింది

అల్లు శిరీష్‌ని ఎలాగైనా సెకండ్‌ లీగ్‌ హీరోల్లో ఒక సుస్థిర స్థానంలోకి చేర్చాలని అల్లు అరవింద్‌ చాలా ప్లాన్స్‌ వేస్తున్నారు. అయితే ఎన్ని సినిమాలు చేస్తున్నా కానీ ఇంతవరకు అల్లు శిరీష్‌కి ఓన్‌ ఐడెంటిటీ ఏమీ రాలేదు. అతని తాజా చిత్రం ఒక్క క్షణం చాలా ఆర్డినరీ ఓపెనింగ్స్‌ తెచ్చుకుంది.

అతని గత చిత్రం శ్రీరస్తు శుభమస్తు మంచి షేర్లే సాధించింది కానీ ఈ చిత్రానికి చాలా నాసిరకం వసూళ్లు వచ్చాయి. న్యూ ఇయర్‌ హాలిడే కలిసి వచ్చినా కానీ ఈ చిత్రం అంతగా సాధించిందంటూ ఏమీ లేదు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' దర్శకుడు వి.ఐ. ఆనంద్‌ ఒక్క క్షణం చిత్రాన్ని కూడా ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. అయితే ఈ చిత్రం చూసిన వారిలో చాలా మంది ఎవరైనా అనుభవం వున్న హీరో వున్నట్టయితే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

నటుడిగా ఒక సినిమాని తదుపరి లెవల్‌కి తీసుకెళ్లడం మాట అటుంచి, సబ్జెక్ట్‌కి న్యాయం చేసే సత్తా లేదనే కామెంట్స్‌ అల్లు శిరీష్‌ ఎదుర్కొంటున్నాడు. ఫస్ట్‌ వీక్‌ డిజప్పాయింట్‌ చేసిన ఈ చిత్రం ఇక సేఫ్‌ అవడం కష్టమేనని ట్రేడ్‌ వర్గాలంటున్నాయి. రొటీన్‌కి భిన్నమైన సినిమాలతో, కంటెంట్‌ ప్రధాన చిత్రాలతో అల్లు శిరీష్‌కి హీరోగా ఐడెంటిటీ తేవాలని చూస్తోన్న అల్లు అరవింద్‌ ప్లాన్‌ ఈ చిత్రానికి బెడిసికొట్టింది. మరి తదుపరి చిత్రం ఎలాంటిది ప్లాన్‌ చేస్తారనేది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు