ఆయన పరుచూరి సోదరుల్ని నరికేయాలన్నాడట

ఆయన పరుచూరి సోదరుల్ని నరికేయాలన్నాడట

సీనియర్ ఎన్టీఆర్‌తో మొదలుపెట్టి.. జూనియర్ ఎన్టీఆర్ వరకు మూడు తరాల స్టార్లతో పని చేసిన సుదీర్ఘ అనుభవం పరుచూరి సోదరులది. గత పది పదిహేనేళ్లలో వీళ్ల హవా అంతగా నడవట్లేదు కానీ.. అంతకుముందు వరకు వాళ్లది తెలుగు సినిమాల్లో రచయితలుగా తిరుగులేని ఆధిపత్యం.. ముఖ్యంగా 70ల నుంచి 90ల మధ్య ఎన్నో భారీ చిత్రాలకు పని చేశారు ఈ లెజెండరీ రైటర్స్. ఎన్టీఆర్.. ఏఎన్నార్.. శోభన్ బాబు.. కృష్ణ.. చిరంజీవి.. బాలయ్య.. ఇలా చాలామంది స్టార్ల సినిమాలకు కథలు అందించారు. హీరోలందరితోనూ వారికి చాలా మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. ఐతే ఒక సందర్భంలో మాత్రం తాము శోభన్ బాబుకు ఆగ్రహం తెప్పించి.. శత్రువులుగా మారిపోయామని పరుచూరి గోపాలకృష్ణ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

శోభన్ బాబు-కృష్ణ కాంబినేషన్లో వచ్చిన ‘మహా సంగ్రామం’ సినిమా సందర్భంగా తమను శోభన్ బాబు అపార్థం చేసుకున్నట్లు గోపాలకృష్ణ వెల్లడించారు. నిజానికి ఈ చిత్రం ఎన్టీఆర్ చేయాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల చేయలేదని.. తర్వాత ఒక హీరో కథను ఇద్దరు హీరోల స్టోరీగా మార్చి శోభన్ బాబు-కృష్ణలతో ఈ సినిమా చేశామని గోపాలకృష్ణ చెప్పారు. ఐతే సినమా పూర్తయ్యాక నిడివి ఎక్కువైందన్న కారణంతో ఎడిటింగ్ లో శోభన్ బాబు పాత్రకు సంబంధించిన సన్నివేశాలు లేపేశారని.. దీంతో ఆయనకు తమపై కోపం వచ్చిందని.. ఆయన ఒకరి దగ్గర ‘ఐ విల్ మసాకర్ (నరకడం) దట్ పరుచూరి బ్రదర్స్’ అన్నట్లు తెలిసిందని.. ఆ తర్వాత కూడా కొంత కాలం పాటు తమ మీద శోభన్ బాబు కోపం కొనసాగినప్పటికీ.. ఆపై శాంతించి తమ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్పయాగం’లో హీరోగా నటించారని పరుచూరి తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు