రకుల్ నోరు జారి బుక్కయిందే..

రకుల్ నోరు జారి బుక్కయిందే..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మామూలుగా వివాదాలకు చాలా దూరంగా ఉంటుంది. ఆమె ఇండస్ట్రీ జనాలతోనే కాక.. మీడియా వాళ్లతోనూ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయదు. చాలా త్వరగా స్టార్ స్టేటస్ సంపాదించడానికి ఇదే కారణం అంటారు. కానీ ఆమె ఇప్పుడో వివాదంలో చిక్కుకుంది. మహేష్ బాబు సినిమా ‘స్పైడర్’ విషయంలో ఆమె ఇంగ్లిష్ డైలీతో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

‘స్పైడర్’ విడుదలకు ముందు ఈ చిత్రంలో అవకాశం దక్కడం గురించి.. తన పాత్ర గురించి ఆమె ఎన్ని కబుర్లు చెప్పిందో తెలిసిందే. ఇలాంటి పాత్ర తాను ఇంతకుముందెన్నడూ చేయలేదని.. అసలు ఏ హీరోయిన్ అయినా ఇలాంటి పాత్ర చేయడం అరుదని వ్యాఖ్యానించింది రకుల్.

ఐతే ‘స్పైడర్’ డిజాస్టర్ అయిన నేపథ్యంలో ఇప్పుడో ఇంగ్లిష్ డైలీతో మాట్లాడుతూ.. ఆ సినిమా గురించి తాను ఎక్కువ మాట్లాడలేనని అంది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడకపోవడం వల్ల తాను ఈ వ్యాఖ్యలు చేయట్లేదని.. ఐతే ఆ సినిమాకు పని చేసిన అనుభవం తనకంత సంతృప్తినివ్వలేదని ఆమె వ్యాఖ్యానించింది.

ఐతే మురుగదాస్‌తో పని చేయడం కోసం ఎంతో కాలంగా ఎదురు చూశానని, మళ్లీ ఆయనతో పని చేయాలనే కోరుకుంటున్నానని అంది. జాగ్రత్తగా గమనిస్తే ఒక రకంగా తన పాత్ర విషయంలో ఆమె సెటైర్లు వేసినట్లే కనిపిస్తోంది.

విడుదలకు ముందు తన పాత్ర గురించి గొప్పలు పోయి.. ఇప్పుడు మాత్రం ఇలా మాట్లాడ్డమేంటి అంటూ సోషల్ మీడియాలో రకుల్ మీద ట్రోలింగ్ మొదలైంది. దీనిపై వివాదం రాజుకోవడంతో తన వ్యాఖ్యల్ని మిస్ కోట్ చేశారంటూ అందరిలాగే మీడియాపై ఫైర్ అయింది రకుల్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు