తెలుగులో ఎవరితో అయినా ఓకేనా?

తెలుగులో ఎవరితో అయినా ఓకేనా?

బేబీ షామిలి ట్యాలెంట్ గురించి.. ఈ తరం బుడతలకు అంతగా తెలియకపోవచ్చు కానీ.. ఓ జనరేషన్ కిందట మాత్రం చైల్డ్ యాక్టర్ గా వెలిగిపోయింది. కొంత ఏజ్ వచ్చాక మెల్లగా సైడ్ అయిపోయి.. మళ్లీ హీరోయిన్ గా ట్రై చేసింది.

ఓయ్ అంటూ సిద్ధార్ధ్ నే కాదు.. తెలుగు ఆడియన్స్ ను కూడా పలకరించిన షామిలి.. వరుసగా సినిమాలు చేయడంలో వెనకబడింది. కొంత గ్యాప్ తీసుకున్న ఈ భామ.. మళ్లీ వర్కవుట్స్ అవీ చేసి.. రీఎంట్రీకి రెడీ అయిపోయింది. నిజానికి తమిళంలో ధనుష్‌ తో ఓ సినిమా చేయాలంటూ ఈమెకు మంచి ఆఫరే వచ్చింది. కానీ ఈ ఓయ్ పిల్ల ఆ సినిమాను వదులుకుంది. ఇందుకు కారణం.. షాలిని భర్త.. తమిళ స్టార్ అయిన బావ అజిత్ వద్దని చెప్పడమే. తమిళ్ సినిమాలకు వచ్చేసరికి ఇతర హీరోలతో తన కుటుంబ సభ్యులు నటించడంపై అభ్యంతరాలు చెప్పాడు తల అజిత్.

కానీ తెలుగులో అమ్మమ్మగారిల్లు అనే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చేస్తోంది షామిలి. నాగశౌర్య హీరోగా నటిస్తున్న సినిమాను.. సుందర్ సూర్య అనే దర్శకుడు రూపొందిస్తున్నాడు. తమిళ్ లో ఇతర హీరోలతో నటించద్దని మరదలికి కండిషన్స్ పెట్టిన బావగారికి.. తెలుగులో ఈమె హీరోయిన్ గా నటిస్తే పెద్దగా ఇబ్బందులేమీ లేనట్లుగా ఉంది. అందుకే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లుగా లేడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న అమ్మమ్మగారిల్లు.. సమ్మర్ నాటికి విడుదల అయ్యే అవకాశాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు