మురుగదాస్ తర్వాతి సినిమాలో వీళ్లే..

మురుగదాస్ తర్వాతి సినిమాలో వీళ్లే..

సౌత్ ఇండియాలో తిరుగులేని సక్సెస్ రేట్ ఉన్న పెద్ద దర్శకుల్లో మురుగదాస్ ఒకడు. ఐతే ఆయనకు ‘స్పైడర్’ రూపంలో తొలిసారి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఐతే ఈ దెబ్బ నుంచి త్వరగానే కోలుకుని తన తర్వాతి సినిమాకు రంగం సిద్ధం చేశాడు మురుగ. ఇంతకుముందు ‘తుపాకి’.. ‘కత్తి’ లాంటి బ్లాక్ బస్టర్లు తీసిన విజయ్ తో తన తర్వాతి చిత్రాన్ని తీయడానికి మురుగదాస్ కమిటైన సంగతి తెలిసిందే. ఈ సినిమాను సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతోంది. బడ్జెట్ రూ.150 కోట్లని సమాాచారం. ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విశేషాలు బయటికి వచ్చాయి.

ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించనున్నట్లు సన్ పిక్చర్స్ ప్రకటించింది. అంతే కాక ప్రస్తుతం సౌత్ ఇండియాలో హాటెస్ట్ హీరోయిన్లలో ఒకరైన కీర్తి సురేష్ ఇందులో విజయ్ తో జత కట్టనున్నట్లు కూడా వెల్లడైంది. ఆమె విజయ్ తో ఇప్పటికే ‘భైరవ’ అనే సినిమాలో నటించింది. ఇక ఈ చిత్రానికి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ కాగా.. మలయాళంలో ఛాయాగ్రాహకుడిగా మంచి పేరు సంపాదించిన గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ అందించనున్నాడు.  ఈ సినిమాకు ఇప్పటికే స్క్రిప్టు రెడీ అయింది. ఇటీవలే విజయ్ తో ఒక ఫొటో షూట్ కూడా చేశాడు మురుగదాస్. అందులో విజయ్ చాలా స్టైలిష్ గా.. మోడర్న్ లుక్ తో కనిపిస్తున్నాడు. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టి దీపావళికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు