రేపు సాయంత్రం అజ్ఞాతవాసి అసలు రూపం

రేపు సాయంత్రం అజ్ఞాతవాసి అసలు రూపం

అజ్ఞాతవాసి కోసం అభిమానులు మాత్రమే కాదు.. టాలీవుడ్ అంతా ఆత్రంగా ఎదురుచూస్తోంది. టాలీవుడ్ రికార్డులతో పాటు భారీ వసూళ్లపై కన్నేసిన ఈ చిత్రంపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. మరోవైపు కాపీ వివాదాలు కూడా ముదిరి పాకాన పడుతున్నాయి.

అజ్ఞాతవాసి చిత్రాన్ని ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ నుంచి కాపీ చేశారనే మాటలు వినిపిస్తున్నాయి. దీనిపై టీ-సిరీస్ సంస్థ నుంచి అజ్ఞాతవాసి మేకర్స్ కు లీగల్ నోటీసులు కూడా వచ్చాయంటున్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు రానా రంగంలోకి దిగాడనే టాక్ ఉంది. మరోవైపు లార్గో వించ్ దర్శకుడు జెరోమ్ సల్లే కూడా రీసెంట్ గా ట్వీట్ చేశాడు. ఈ చిత్రం చూడాలనే క్యూరియాసిటీ ఉందని ట్వీట్ పెట్టాడు. అయితే.. ఈ వివాదానికి రేపు సాయంత్రం బ్రేక్ పడిపోవచ్చు. కాపీనా కాదా అనే విషయంపై ఓ క్లారిటీ వచ్చేస్తుంది. రేపు సాయంత్రం అజ్ఞాతవాసి ట్రైలర్ రిలీజ్ అవుతోంది. ట్రైలర్ లోనే కథ చెప్పేయడం అటు పవన్ కు.. ఇటు త్రివిక్రమ్ కు ముందు నుంచి ఉన్న అలవాటే. ఆ ప్రకారం చూస్తే.. లార్గో వించ్ ను కాపీ చేశారా.. థీమ్ తీసుకున్నారా.. ఇది వేరే చిత్రమే అనే అంశాలపై స్పష్టత వచ్చేందుకు అవకాశాలున్నాయి.

అయితే.. టాలీవుడ్ ఇన్ సైడ్ టాక్ ప్రకారం చూసుకుంటే.. లార్గోవించ్ మూవీ అంతా హీరో పాత్ర చుట్టూ తిరుగుతుంది. కానీ అజ్ఞాతవాసి మూవీ విషయానికి వస్తే.. సినిమాకు ఖుష్బూ పాత్రను లీడ్ చేసి.. ఆమె చుట్టూ కథ అంతా తిరిగేలా ఉంటుందని అంటున్నారు. ఏదేమైనా అసలు విషయం రేపు ఈవెనింగ్ కల్లా తెలిసిపోవడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు