ఆర్నెల్లలో తగ్గినందుకే కరీనా ఇలా??

ఆర్నెల్లలో తగ్గినందుకే కరీనా ఇలా??

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ను ఫ్యాన్స్ అంతా ముద్దుగా బెబో అని పిలుచుకుంటారు. బ్యూటీ విషయంలో జీరో సైజ్ అందాల వంటి పలు కాన్సెప్ట్ లను ఇండియాకు పరిచయం చేసిన ఈ భామ.. 2016 డిసెంబర్ లో ఓ పండండి బాబుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

అయితే.. ప్రసవం తర్వాత ఆరు నెలల సమయానికే స్లిమ్ గా మారిపోయి.. తన పాత సైజుల్లోకి వచ్చేసి అందరికీ షాక్ ఇచ్చింది కరీనా కపూర్ ఖాన్. ప్రస్తుతం హై లెవెల్ ఎక్స్ పోజింగ్ చేస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చి.. మళ్లీ గ్లామర్ దివా ట్యాగ్ కోసం పోరాడుతోంది. అంతవరకూ బాగానే ఉంది కానీ.. అమ్మడి మొహంలో పాత కళ మాత్రం కనిపించడం లేదు. 3ఈడియట్స్ మూవీ సమయానికి కరీనా ఏ స్థాయిలో మెరిసిపోయిందో చూశాం. కానీ ఇప్పుడు ఆ గ్లో ఏమీ కరీనా కళ్లలో కానీ.. ఫేస్ లో కానీ కనిపించడం లేదు. ఇందుకు కారణం.. ఫుల్ స్పీడ్ లో స్లిమ్ అయిపోవడమేనా అనుకుంటున్నారు ఫ్యాన్స్.

మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యారాయ్ కూడా ప్రసవం తర్వాత సినిమాల్లో కనిపించింది. కానీ ఇందుకు ఆమె ఏకంగా ఐదేళ్ల గ్యాప్ తీసుకుంది. మొహంలో కళ తగ్గకుండా ఉండేందుకు.. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంది ఐష్. ప్రస్తుతం టాలీవుడ్ బ్యూటీ అనుష్క పరిస్థితి చూస్తూనే ఉన్నాం. సన్నబడేందుకు సుదీర్ఘ సమయమే పడుతోంది. కానీ వీరెవ్వరికీ సాధ్యం కాని రేంజ్ లో.. ఆర్నెల్లలో సన్నబడ్డ కరీనా.. మొహంలో పాత వెలుగులను మాత్రం పొందలేకపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు