ఏమీ దాచిపెట్టనందుకు కూడా అవార్డ్

ఏమీ దాచిపెట్టనందుకు కూడా అవార్డ్

'దాచి పెట్టడానికి ఏమీ లేదు' అంటూ ఓ షాంపూ కంపెనీ యాడ్స్.. టీవీల్లో తెగ వస్తుంటాయి.. గుర్తొచ్చిందా? బాలీవుడ్ లో అయితే 'నథింగ్ టు హైడ్' అంటూ ఈ యాడ్ టెలికాస్ట్ అవుతుంది.  మరి దీన్ని ఇన్ స్పిరేషన్ తీసుకున్నారో.. లేక వాళ్ల దగ్గర నుంచి స్పాన్సర్ షిప్ సంపాదిచారో.. లేక కొత్త కేటగిరీ సృష్టిస్తామని అనుకున్నారో తెలియదు కానీ.. స్టార్ స్క్రీన్ అవార్డ్స్ లో ఓ కేటగిరీ మాత్రం నవ్వుల పాలు అవుతోంది.

నథింగ్ టు హైడ్ అంటూ ఈ ఏడాది ఓ కొత్త కేటగిరీని సృష్టించారు నిర్వాహకులు. తొలిసారి అందిస్తున్న ఈ విభాగంలో.. మేల్ కేటగిరీ అవార్డును షాహిద్ కపూర్ కు.. ఫిమేల్ కేటగిరీ అవార్డును కృతి సనోన్ కు ఇచ్చారు. ఈవెంట్ కు షాహిద్ హాజరు కాలేదు కానీ.. ఓ వీడియో పంపించాడు. కృతి మాత్రం ఎంచక్కా వచ్చి బోలెడన్ని థ్యాంక్స్ చెప్పి అవార్డు అందుకుని.. ఎమోషనల్ కూడా అయింది. అసలు ఈ కేటగిరీ ఉద్దేశ్యం ఏంటంటే.. తమ సినిమా సంగతులను.. రిజల్ట్ ను.. యథాతథంగా వాస్తవాలను సోషల్ పంచుకునే పర్సన్స్ కి ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. అలా వీళ్లిద్దరికీ దక్కిందట.

అంతవరకూ బాగానే ఉంది కానీ.. షాహిద్ -కృతి సనోన్ లకు నథింగ్ టు హైడ్ అవార్డ్ ప్రకటించిన తర్వాత.. 'ఇంతకంటే ఏమీ తట్టలేదా'.. 'అసలు దాచడానికి అవార్డు ఏంటి? '.. ఇలా అర్ధం వచ్చేలా రకరకాల కామెంట్స్ తో అటు స్టార్ స్క్రీన్ అవార్డ్స్ నిర్వాహకులను.. ఇటు అవార్డ్ విన్నర్స్ ను ఆడేసుకున్నారు ట్విట్టర్ జనాలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు