సైరా... ఎప్పటిలా మీడియా ఓవరాక్షనే!

సైరా... ఎప్పటిలా మీడియా ఓవరాక్షనే!

సైరా షూటింగ్‌ మొదలయి కొన్నాళ్లయిందో లేదో దానిని టార్గెట్‌ చేసేసుకున్నాయి గాసిప్‌ వెబ్‌సైట్లు. సురేందర్‌ డైరెక్షన్‌తో చిరంజీవి హ్యాపీగా లేడని, దర్శకుడిని మార్చేయాలని చూస్తున్నాడని, ఈ విషయంపై చరణ్‌, చిరంజీవి మధ్య కూడా వాదం నడుస్తోందని రకరకాల పుకార్లు పుట్టించేసారు. షూటింగ్‌కి కొంత విరామం వుండడంతో, అందులోను గడ్డం అవసరం లేని కొన్ని సన్నివేశాల చిత్రీకరణ వుండడంతో చిరు గడ్డం తీస్తే, అదిగో చిరంజీవి గడ్డం తీసేసాడు కనుక షూటింగ్‌ ఆగిపోయిందని గోల మొదలు పెట్టేసారు.

తీరా చూస్తే చరణ్‌, సురేందర్‌ హ్యాపీగా విదేశీ టూర్‌కి కలిసే వెళ్లారు. అసలు గుణశేఖర్‌ని కానీ, వినాయక్‌ని కానీ ఈ ప్రాజెక్ట్‌లోకి ఎలా తీసుకొస్తారు? గుణశేఖర్‌ రీసెంట్‌ ట్రాక్‌ రికార్డ్‌కి అతనిపై ఎవరైనా నమ్మకం పెడతారా? రుద్రమదేవి చిత్రాన్ని కూడా అపరిపక్వంగా తీసి అక్షింతలు వేయించుకున్న దర్శకుడి చేతిలో రెండు వందల కోట్ల ప్రాజెక్టుని పెడతారా ఎవరైనా? ఇకపోతే వినాయక్‌ అచ్చమైన మాస్‌ డైరెక్టర్‌. ఫైట్లు, ఎలివేషన్లు తీయగలడు కానీ అతని సినిమాల్లో కనీసం గ్రాఫిక్స్‌ షాట్లు కూడా వుండవు.

వినాయక్‌ స్టయిల్‌ ఏంటనేది చిరంజీవికి బాగా తెలుసు. టెక్నికల్‌గా చాలా పట్టున్న సురేందర్‌ క్వాలిటీ అవుట్‌పుట్‌ తీసుకుంటాడు. అతనికి ఇంత బడ్జెట్‌ సినిమా తీసిన అనుభవం లేదు కానీ దర్శకుడిగా అతని ప్రతిభని శంకించడానికి లేదు. ఇలాంటి రాతల వల్ల ఒక దర్శకుడి ఇమేజ్‌ పాడవుతుందని, ఎన్నో కోట్ల విలువైన సినిమాకి రిమార్క్‌ పడుతుందని చూడకుండా కేవలం పూట గడవడం కోసం మీడియా చేస్తోన్న ఓవరాక్షన్‌ని ఏమనాలి అసలు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు