వందరోజుల దారిలో...!

వందరోజుల దారిలో...!

పవన్ కళ్యాణ్ ఓ మాదిరి సినిమా చేసినా... హిట్టయిపోతుంది. ఇక హిట్ సినిమా చేశాడంటే.. . ? `అత్తారింటికి దారేది`లా సంచలనాలు నమోదవుతాయి. అవును...! ఇప్పుడు పవన్ కళ్యాణ్ సంచలనాలతో తెలుగు చిత్ర పరిశ్రమ కళకళలాడిపోతోంది. వసూళ్ళ పరంగా ఈ సినిమా కొత్త చరిత్రను సృష్టించింది. వంద కోట్ల వసూళ్ళ మైలు రాయిని చేరుకోబోతోంది.  తాజాగా యాభై రోజుల ప్రయాణాన్ని కూడా  పూర్తి చేసుకుంది. ఇటీవల కాలంలో నిజంగా యాభై రోజులు ఆడిన సినిమా అంటే ఇదే.

శుక్రవారం ఈ సినిమాకి యాభై రోజులు... అయినా ఇప్పటికీ వసూళ్లు చాలా బాగా ఉన్నాయి. ఈ ఊపును చూస్తుంటే సినిమా వంద కోట్ల మెయిలు రాయిని చేరుకోవడం ఖాయం అంటున్నాయి సినిమా వర్గాలు. నిర్మాత బీవీయస్ యన్ ప్రసాద్ మాట్లాడుతూ... ``పవన్ కళ్యాణ్ స్టామినాకి నిదర్శనం ఈ సినిమా. కష్టకాలంలో విడుదలైనా ప్రేక్షకుల ఆదరణ లభించడం ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ నటన, ఆయన పండించిన వినోదం ప్రేక్షక లోకాన్ని ఎంతగానో అలరించింది`` అన్నారు. యాభై రోజుల మైలు రాయిని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు వందరోజుల దారిలో ప్రయాణాన్ని మొదలుపెట్టింది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English