ఎన్టీఆర్‌ అందుకే రిజెక్ట్‌ చేసాడా?

ఎన్టీఆర్‌ అందుకే రిజెక్ట్‌ చేసాడా?

అల్లు అర్జున్‌ కొత్త సినిమా 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' ఫస్ట్‌ ఇంపాక్ట్‌ అదిరిపోయింది. యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా బన్నీ ఈ టీజర్‌తో అమితంగా ఆకట్టుకున్నాడు. సినిమాపై అంచనాలని పెంచేలావున్న టీజర్‌ చూసిన తర్వాత ఈ సినిమాని ఎన్టీఆర్‌ ఎందుకు రిజెక్ట్‌ చేసాడనే ప్రశ్న తలెత్తింది. ఈ చిత్రంలో ఎన్టీఆరే నటించాల్సి వుంది. రెండేళ్లకి పైగా వక్కంతం వంశీ అతని డేట్స్‌ కోసం వేచి చూసాడు.

చివరకు ఎన్టీఆర్‌ నో చెప్పడంతో అల్లు అర్జున్‌ దగ్గరకి వెళ్లిపోయాడు. టీజర్‌ చూసిన తర్వాత ఈ సినిమా ఎన్టీఆర్‌ రిజెక్ట్‌ చేయడానికి కారణమేంటనేది అర్థమైంది. ఇందులో హీరోది మరీ సీరియస్‌ క్యారెక్టర్‌. టెంపర్‌లో ఎన్టీఆర్‌ ఆవేశపూరితమైన పాత్రే చేసాడు. దానికి కూడా కథ వక్కంతం వంశీనే అందించాడు. లైటర్‌ వీన్‌లో సినిమా చేద్దామనే మూడ్‌లో వున్న ఎన్టీఆర్‌కి వక్కంతం వంశీ ఇంకో కథ చెప్పలేదు.

ఇదే తన తొలి చిత్రంగా చేయాలని డిసైడ్‌ అవడంతో ఎన్టీఆర్‌ చేయనని చెప్పేసాడు. బన్నీకి ఈ తరహా పాత్రలు కొత్త కానీ ఎన్టీఆర్‌ ఇంతకుముందు సాంబ, దమ్ము తదితర చిత్రాల్లో రౌద్ర రసాన్ని పోషించాడు. ఈ సినిమాని ఎన్టీఆర్‌ రిజెక్ట్‌ చేయడంలో ఆశ్చర్యం లేదు. అతను చేసినట్టయితే ఇది రొటీన్‌గా అనిపించి వుండేదేమో కూడా. ఫలితంతో సంబంధం లేకుండా ఈ చిత్రాన్ని రిజెక్ట్‌ చేసి మంచి పనే చేసాడని అభిమానులు చెప్పుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు