హీరోలని ఆడిస్తోన్న సాయి పల్లవి

హీరోలని ఆడిస్తోన్న సాయి పల్లవి

సాయి పల్లవి క్రేజ్‌ ఇప్పుడు ఏ స్థాయిలో వుందనేది ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. 'ఎంసిఏ' చిత్రానికి ఆ రేంజ్‌లో ఓపెనింగ్స్‌ రావడానికి సాయి పల్లవి కూడా కారణమైంది. ప్రస్తుతం ఆమెకి వున్న డిమాండ్‌తో కేవలం తెలుగు చిత్ర పరిశ్రమ నుంచే కాకుండా తమిళం, మలయాళ చిత్ర సీమల నుంచి ఆఫర్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి.

తనకి నచ్చిన కథలు మాత్రమే ఎంచుకుని చేస్తోన్న సాయి పల్లవి ఇప్పుడు తాను డేట్స్‌ అడ్జస్ట్‌ చేసుకోవడం కాకుండా తనకోసమే హీరోలు డేట్స్‌ మార్చుకుని, ప్రాజెక్టులు అటు ఇటు చేసే రేంజ్‌కి వెళ్లింది. శర్వానంద్‌తో హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందే చిత్రంలో సాయి పల్లవి కథానాయిక అనే సంగతి తెలిసిందే. ఈ చిత్రం కాస్త ఆలస్యంగా మొదలు కావాల్సి వుంది. ముందుగా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో చిత్రం పూర్తి చేసిన తర్వాత దీనిని మొదలు పెడదామని శర్వానంద్‌ ప్లాన్‌ చేసుకున్నాడు.

కానీ సాయి పల్లవి డేట్స్‌ ఫిబ్రవరి నుంచి దొరకడం కష్టమైపోతుందని, సుధీర్‌వర్మ చిత్రాన్ని వాయిదా వేసి హను సినిమాని ముందుకి తీసుకొచ్చాడు. షూటింగ్‌ వెంటనే మొదలు పెట్టాల్సి రావడంతో హను కూడా హడావిడిగా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి చేసాడట. ఒక్క హీరోయిన్‌ కోసం ఇన్ని అడ్జస్ట్‌మెంట్లు చేసుకోవడంలో ఈమధ్య కాలంలో ఎన్నడూ లేదు. సాయి పల్లవి రేంజ్‌ ఎలాగుందనేది చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు