ప్రభాస్ బాలీవుడ్ అరంగేట్రమా.. అదేంటీ?

ప్రభాస్ బాలీవుడ్ అరంగేట్రమా.. అదేంటీ?

బాహుబలి తర్వాత ప్రభాస్ కి బాలీవుడ్ లో బోలెడంత క్రేజ్ ఏర్పడిపోయింది. ప్రభాస్ తో సినిమా చేసేందుకు చాలామంది మేకర్స్ క్యూ కట్టేశారు. కరణ్ జోహార్ తో సినిమాపై చాలానే ప్రచారం జరిగింది. అయితే.. యంగ్ రెబల్ స్టార్ మాత్రం ముందుగా కమిట్ అయిన సాహోకే ఫిక్స్ అయ్యాడు. దీంతో ప్రభాస్ హిందీ చిత్రంపై జరుగుతున్న ప్రచారానికి టెంపరరీగా బ్రేక్ పడింది.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రభాస్.. సాహో తర్వాత తన మరుసటి చిత్రం బాలీవుడ్ లోనే అంటూ అసలు విషయం చెప్పేశాడు. ఓ లవ్ స్టోరీలో నటిస్తానని చెప్పిన ప్రభాస్.. బాలీవుడ్ తన అరంగేట్ర చిత్రం అంటూ ఆశ్చర్యపరిచాడు. బాహుబలి విషయంలో అంటే అది పక్కాగా తెలుగుతో మొదలుపెట్టిన సినిమా. బాహుబలి2 కి వచ్చేసరికే లెక్కలు మారిపోయాయి. అన్ని భాషలకు తగినట్లుగానే రూపొందించారు. ఆ సంగతలా ఉంచినా.. ఇప్పుడు తెరకెక్కుతున్న సాహో మూవీని.. తెలుగుతో పాటు హిందీలో కూడా తెరకెక్కిస్తున్నారు. అలాగే దేశంలోని పలు భాషల్లో రిలీజ్ అవుతుందని కూడా చెప్పారు. ఇలాంటప్పుడు అయితే గియితే ప్రభాస్ కు సాహో బాలీవుడ్ డెబ్యూ మూవీ కావాలి.

అలా కాకుండా.. తను తర్వాత చేయబోయే హిందీ చిత్రాన్ని బాలీవుడ్ డెబ్యూ అనడం ఏంటో అర్ధం కాని విషయం. అంటే సాహో మూవీ బాలీవుడ్ డెబ్యూ మూవీ కాదా అనే డౌట్స్ వస్తున్నాయి. అసలు ప్రభాస్ ఏం చెబుతున్నాడో అర్దం కాని పరిస్థితి. హిందీలో కూడా రూపొందుతున్న సాహో.. హిందీలో రిలీజ్ రిలీజ్ అయినపుడు.. అదే డెబ్యూ మూవీ కదా అని కొందరి డౌట్?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు