ఈసారి ఐటెం వద్దులే బన్నీ!!

ఈసారి ఐటెం వద్దులే బన్నీ!!

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న నా పేరు సూర్య మూవీకి ఫస్ట్ ఇంపాక్ట్ వచ్చేసింది. మూవీలో యాక్షన్ డోస్ తో పాటు.. సినిమా అంతా సీరియస్ జోనర్ లో సాగుతుందనే విషయం చెప్పకనే చెప్పాడు అల్లు అర్జున్. అయితే.. బన్నీ సినిమాల్లో ఒక అంశం హైలైట్ అవుతూ ఉంటుంది. అప్పట్లో వచ్చిన ఆర్య చిత్రంలో అ అంటే అమలాపురం నుంచి.. దాదాపుగా ప్రతీ చిత్రంలోను ఐటెం సాంగ్ పెడుతుంటాడు స్టైలిష్ స్టార్.

ఇలాంటి పాటలు లేని సినిమాలు కూడా ఉన్నా వాటి కౌంట్ తక్కువే. ఈ పాటలతో మాంచి సక్సెస్ లు కొడుతూ ఉంటాడు. మూవీకి ఈ ఐటెం సాంగ్స్ హైలైట్ అయ్యేలా చేయడం బన్నీ స్పెషలిస్ట్. కానీ ఇప్పుడు నా పేరు సూర్యలో కూడా ఐటెం సాంగ్ పెడతారా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. హీరో అడిగినా.. డైరెక్టర్ ఫిక్స్ అయినా ఓ సిట్యుయేషన్ క్రియేట్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు కానీ.. నా పేరు సూర్యలో ఇలా ఐటెం సాంగ్ వద్దులే బన్నీ అంటున్నారు అభిమానులు. ఇందుకు కారణం.. ఈ చిత్రం మిలిటరీ జోనర్ లో సాగే మూవీ కావడమే. యాంగ్రీ మిలిటరీ పర్సన్ క్యారెక్టర్ చుట్టూ అల్లిన కథ అనే సంగతి తెలిసిపోయింది.

ఇలా సీరియస్ గా సాగే సినిమాల్లో ఐటెం సాంగులు పంటి కింద రాళ్లలా తగులుతూ ఉంటాయి తప్ప.. సినిమాకు పెద్దగా హెల్ప్ కావు. అందుకే ఈ సారి ఐటెంసాంగ్స్ కు సెలవు ఇచ్చేసి.. సీరియస్ గా సీరియస్ జోనర్ మూవీని పూర్తి చేసేస్తే బెటర్ అనే సలహాలు వినిపిస్తున్నాయి. మరి అల్లు అర్జున్ ఎలా ఫిక్స్ అయ్యాడో చూడాలి.