అటు రానా.. ఇటు వరుణ్.. మధ్యలో ఏనుగు

అటు రానా.. ఇటు వరుణ్.. మధ్యలో ఏనుగు

దగ్గుబాటి రానా ఇప్పుడు ఫుల్ స్వింగ్ లోనే ఉన్నాడు. బాహుబలి2 బ్లాక్ బస్టర్ తర్వాత.. సోలో హీరోగా నేనే రాజు నేనే మంత్రి మూవీతో కూడా హిట్ కొట్టిన రానా.. బుల్లితెరపై కూడా  హోస్ట్ గా సక్సెస్ అయ్యాడు. మరోవైపు పలు భాషలలో సినిమాలు చేస్తూ తెగ బిజీగా ఉన్న ఈ హీరో.. మల్టీస్టారర్స్ కు సైన్ చేసేందుకు కూడా సై అనేస్తున్నాడు.

ఇప్పటికే తమిళ డైరెక్టర్ సాల్మన్ రాజ్ రూపొందిస్తున్న హాథీ మేరా సాథీ చిత్రంలో నటిస్తున్నట్లు రానా చెప్పేశాడు. ఇది మల్టీస్టారర్ మూవీ కాగా.. ఇందులో మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్నాడనే టాక్ వినిపించింది. ఈ వార్తలను కన్ఫాం  చేస్తూ.. ఇప్పుడు దర్శకుడు అధికారికంగా అసలు విషయం చెప్పేశాడు. హాథీ మేరా సాథీ మూవీలో రానాతో పాటు సమానంగా వరుణ్ తేజ్ క్యారెక్టర్ కూడా ఉంటుందని చెప్పడంతో.. ఈ చిత్రంలో మెగా హీరో నటిస్తున్నాడనే విషయం అధికారికం అయిపోయింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటిస్తున్నచిత్రంలో కూడా వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. ఇధి కూడా మల్టీస్టారర్ స్టారర్ మూవీ కాగా.. ఇప్పుడు రానాతో కూడా మల్టీస్టారర్ కి యాక్సెప్ట్ చేయడం విశేషం.

తన రోల్ కంటే కంటెంట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెప్పకనే చెబుతున్నాడు వరుణ్ తేజ్. ఇక హాథీ మేరా సాథీ విషయానికి వస్తే.. 1971లో వచ్చిన రాజేష్ ఖన్నా మూవీ నుంచి ఇన్ స్పైర్ అయినా.. ఈ సినిమాకు.. ఈ హాథీ మేరా సాథీకు ఏం సంబంధం ఉండదని తెలుస్తోంది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ మూవీ తీస్తున్నారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English