పెట్టుబడి మొత్తం బూడిదే..

పెట్టుబడి మొత్తం బూడిదే..

గత శుక్రవారం ‘2 కంట్రీస్’ అనే సినిమా ఒకటి విడుదలైందన్న సంగతి కూడా జనాలు పట్టించుకున్నట్లుగా లేరు మరి. ఈ సినిమా గురించి సామాజిక మాధ్యమాల్లో కనీస చర్చ కూడా జరగలేదు. సెప్టెంబర్లో సునీల్ చివరి సినిమా ‘ఉంగరాల రాంబాబు’ రిలీజైనపుడు.. ఆ సినిమా మీద ట్రోలింగ్ చేస్తూ అయినా ట్వీట్లు పడ్డాయి.

కానీ ‘2 కంట్రీస్’కు వచ్చేసరికి ఆ రకమైన చర్చ కూడా లేదాయె. ఇక ఈ సినిమా టాక్ గురించి.. వసూళ్ల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. సునీల్ గత సినిమాలకు ఏమాత్రం తగ్గని బోరింగ్ సినిమా ఇదని క్రిటిక్స్ తేల్చేస్తే.. ఈ సినిమాకు కనీస ఓపెనింగ్స్ కరవయ్యాయి. తొలి రోజే థియేటర్లు వెలవెలబోయాయి. టాక్ దారుణంగా ఉండేసరికి వసూళ్లు ఏమాత్రం పుంజుకోలేదు.

కనీసం సునీల్‌కు పట్టున్న బి-సి సెంటర్లలో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. కలెక్షన్లు సమ్మరైజ్ చేసే స్థాయిలో కూడా ఆ లెక్కలు లేకపోవడంతో ట్రేడ్ పండిట్స్ సైతం ఊరుకున్నారు. ‘2 కంట్రీస్’ చేయడానికి ముందే సునీల్ మార్కెట్ బాగా దెబ్బ తినేసి ఉంది. అయినా ఎన్.శంకర్ స్వయంగా నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఆ సాహసం బెడిసికొట్టింది. పెట్టుబడి మొత్తం కొట్టుకుపోయింది. ఈ దెబ్బతో హీరోగా సునీల్ కెరీర్‌కు దాదాపుగా తెరపడిపోయినట్లే.

అతడిని హీరోగా పెట్టి ఇంకో సినిమా తీయడానికి ఎవరూ ముందుకు రాకపోవచ్చేమో. సునీలేమో వచ్చే ఏడాది కమెడియన్‌గా మూడు, హీరోగా మూడు సినిమాలు తీస్తానన్నాడు. మరి అతడి మాటలు ఎంత వరకు నిజమవుతాయో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు