సంక్రాంతికి వాళ్లిద్దరి డబుల్ ధమాకా

సంక్రాంతికి వాళ్లిద్దరి డబుల్ ధమాకా

కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టేశాం. తెలుగు సినిమాకు అతి పెద్ద సీజన్ అయిన సంక్రాంతి వచ్చేస్తోంది. గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి కొంచెం సందడి తక్కువగానే ఉండబోతోంది. సంక్రాంతికి 2016లో నాలుగు.. 2017లో మూడు తెలుగు సినిమాలు రిలీజైతే.. ఈసారి ఆ సంఖ్య రెండుకు పరిమితమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘అజ్ఞాతవాసి’తో పాటు బాలయ్య చిత్రం ‘జై సింహా’.. వీటితో పాటుగా డబ్బింగ్ సినిమా ‘గ్యాంగ్’ రిలీజవుతున్నాయి.

ఈ మూడు సినిమాల్లో రెండు సినిమాలకు రెండు కామన్ పాయింట్లున్నాయి. ఆ రెండు సినిమాలు ‘అజ్ఞాతవాసి’.. ‘గ్యాంగ్’. ఈ రెండు సినిమాలకూ ఒకరే మ్యూజిక్ డైరెక్టర్. రెండింట్లోనూ ఒక హీరోయిన్ నటిస్తోంది.

‘కొలవెరి’ పాటతో సెన్సేషన్ క్రియేట్ చేసి.. ఆపై తమిళంలో ఎన్నో బ్లాక్‌బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చిన యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్.. తొలిసారిగా తెలుగులో చేసిన సినిమా ‘అజ్ఞాతవాసి’. అరంగేట్రంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు సంగీతం అందించాడతను.

ఈ సినిమా ఆడియో ఇప్పటికే హిట్టయింది. ఇక సినిమాలో అనిరుధ్.. బ్యాగ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు తమిళంలో అతను తొలిసారి సూర్య సినిమాకు పని చేసింది ‘గ్యాంగ్’కే. ఆ సినిమా మీదా అంచనాలు భారీగా ఉన్నాయి. అనిరుధ్ మ్యూజిక్ కూడా ఆసక్తి రేకెత్తించే విషయమే. మరోవైపు ఇప్పటికే తెలుగులో ఇప్పటికే రెండు సూపర్ హిట్లు కొట్టిన కీర్తి సురేష్.. తొలిసారిగా పవన్ లాంటి పెద్ద హీరోతో నటించిన సినిమా ‘అజ్ఞాతవాసి’. ఆమె తమిళంలో సూర్యతో తొలిసారి నటించిన సినిమా ‘గ్యాంగ్’. ఆమెకు ఈ రెండు సినిమాలూ కీలకమే. మరి అనిరుధ్.. కీర్తి.. ఈ సంక్రాంతికి డబుల్ ధమాకా అందుకుంటారేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు