కళ్యాణ్ బాబాయ్ కుమ్మేస్తున్నాడు?

కళ్యాణ్ బాబాయ్ కుమ్మేస్తున్నాడు?

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో కంటిన్యూ అవుతుండడంలో ఆశ్చర్యమేమీ లేదు. త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీపై ఇప్పటికే అంచనాలు పీక్స్ కి వెళ్లిపోయాయి. పాటల విషయంలో బాగా క్లాస్ టచ్ అనే మాట వినిపిస్తున్నా.. పవన్ క్రేజ్ ముందు అవేమీ పెద్దగా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు.

ఇక ఇప్పటివరకూ ప్రమోషన్స్ ను మెల్లమెల్లగా చేసిన ప్రొడ్యూసర్స్.. ఇప్పుడు వేగం పెంచేస్తున్నారు. కొత్త కొత్త పోస్టర్స్ తో ఫ్యాన్స్ ను థ్రిల్ చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఓ పోస్టర్ అయితే అభిమానులను మరీ పిచ్చెక్కించేస్తోంది. ఒకవైపు కీర్తి సురేష్.. మరోవైపు అను ఇమాన్యుయేల్ లను కూర్చోబెట్టుకుని.. మధ్యలో కూర్చుని పవన్ ఇచ్చిన పోజ్ మరీ మెస్మరైజింగ్ గా ఉంది. ఈ ఫోటోను తెగ షేరింగ్ చేసేస్తున్న నెటిజన్స్.. కళ్యాణ్ బాబాయ్ కుమ్ముడు మామూలుగా లేదుగా అని డిస్కషన్స్ చేసేస్తున్నారు. జనవరి 10వ తేదీన రిలీజ్ కానున్న అజ్ఞాతవాసిపై ఎక్స్ పెక్టేషన్స్ అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి.

రీసెంట్ గా అజ్ఞాతవాసికి సెన్సార్ కంప్లీట్ చేయగా.. అక్కడి వినిపిస్తున్న మాటల ప్రకారం అయితే.. మూవీ బ్లాక్ బస్టర్ అని ఫ్యాన్స్ ముందే ఫిక్స్ అయిపోయారు. మరి ఈ సెన్సార్ టాక్ లలో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ మాత్రం అన్నిటికంటే పెద్ద హైలైట్. ఇక అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్.. మూవీకి మరో అట్రాక్షన్ గా నిలవనుంది. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు