లావణ్య బికినీ స్టిల్ అదిరింది.. కాని..

లావణ్య బికినీ స్టిల్ అదిరింది.. కాని..

టాలీవుడ్ లో క్యూట్ గా కనిపించే హీరోయిన్స్ లలో లావణ్య త్రిపాఠి తప్పకుండా ఉంటుందని చెప్పాలి. చూడగానే సొట్ట బుగ్గల నవ్వుతో అందరిని ఆకట్టుకునే ఈ అందాల రాక్షసి ఎలాంటి పాత్రల్లో అయినా మెప్పించడానికి ట్రై చేస్తుంది. ప్రస్తుతం సీనియర్ హీరోలు కుర్ర హీరోలు అని తేడా లేకుండా అందరు అమ్మడితో నటించడానికి చాలా ట్రై చేస్తున్నారు. ఇక లావణ్యకు ఎలాంటి.పరిస్థితి ఏర్పడిన చిటికెలో దాన్ని మర్చిపోవడానికి ట్రై చేస్తూంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రస్తుతం ఈ సొట్ట బుగ్గల సుందరి హాలిడే ట్రిప్ లో ఉంది. రీసెంట్ గా న్యూ ఇయర్ సందర్భంగా తన అభిమానుల కోసం రిలీజ్ చేసిన ఒక ఫొటో ప్రస్తుతం అందరిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఎప్పుడు కనిపించని విధంగా బికినీ లుక్ తో అందాల రాక్షసి రచ్చ చేసింది. కాకపోతే బ్యాక్ స్టీల్ ఇచ్చి ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ కి ఛాన్స్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆ ఫోటో చూసిన ఆమె ఫాలోవర్స్ బ్యాక్ స్టిల్ అదిరింది అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక లావణ్య స్పెషల్ గా న్యూ ఇయర్ విషెస్ ని కూడా చెప్పింది. ఫోటో అదిరిపోయినా.. అది బ్యాక్ నుండి తీసిన పిక్ కాబట్టి కొంతమంది గ్లామర్ లవ్వర్లు హర్టయ్యారట.

2017 కెరీర్ లో అమ్మడికి ఎక్కువగా అపజయాలు అందిన సంగతి తెలిసిందే. అయినా కూడా లావణ్య ఏ మాత్రం ఆందోళన చెందకుండా లైఫ్ లో ఇవన్నీ కామన్ అన్నట్టుగా ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం చేతిలో కొన్ని సినిమాలు ఉన్నాయి. అంతే కాకుండా కోలీవుడ్ లో ఇటీవల మాయవన్ అనే సినిమా హిట్ అవ్వడంతో స్టార్ హీరోతో ఛాన్స్ కొట్టేసిందని తమిళనాట వార్తలు వినిపిస్తున్నాయి. మరి 2018 ఈ బ్యూటీకి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు