మహేష్ మళ్లీ మొదలుపెడుతున్నాడు

మహేష్ మళ్లీ మొదలుపెడుతున్నాడు

టాలీవుడ్ సూపర్ స్టార్ కొన్ని రోజులుగా షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చాడు. మహేష్ గత చిత్రం స్పైడర్ విడుదలకు ముందే.. కొరటాలతో కొత్త సినిమా స్టార్ట్ చేయగా.. ఇప్పుడీ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చేస్తోంది. క్రిస్మస్.. న్యూఇయర్ సందర్భంగా.. యూనిట్ అంతా దాదాపు 10 రోజుల పాటు బ్రేక్ తీసుకోగా.. ఇప్పుడు కొత్త షెడ్యూల్ కు రంగం సిద్ధమైంది.

భరత్ అనే నేను టైటిల్ పై రూపొందుతున్న ఈ చిత్రం కోసం.. రామేశ్వరం సమీపంలోని ధనుష్కోటిలో కొన్ని రోజుల పాటు షూటింగ్ నిర్వహించారు. కరైకుడిలో కూడా 10 రోజుల షెడ్యూల్ పూర్తయ్యాక బ్రేక్ తీసుకోగా.. ఈ నెల 7 నుంచి కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టేందుకు దర్శకుడు సిద్ధం అవుతున్నాడు. హైద్రాబాద్ లో కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేయగా.. దాదాపుగా ఈ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తి కానుందని తెలుస్తోంది. ఓ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు.. ప్రధాన తారాగణం అంతానటించే కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారట. వీటిలో ప్రీక్లైమాక్స్ షూట్ కూడా ఉంటుందని తెలుస్తోంది.

బాలీవుడ్ భామ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని.. ఏప్రిల్ 27న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ తేదీ విషయంలో కొంత గందరగోళం నెలకొన్నా.. 2.ఓ విషయంలో రజినీకాంత్ క్లారిటీ ఇచ్చేయడంతో.. మహేష్ బాబు చిత్రం రిలీజ్ డేట్ ను మరోసారి అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్న భరత్ అనే నేను చిత్రాన్ని భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు