టాక్ చూస్తే హిట్టే.. వసూళ్లు చూస్తే ఫ్లాపే

టాక్ చూస్తే హిట్టే.. వసూళ్లు చూస్తే ఫ్లాపే

క్రిస్మస్ వీకెండ్లో అక్కినేని అఖిల్ సినిమా ‘హలో’ మంచి అంచనాల మధ్య రిలీజైంది. అంచనాలకు తగ్గట్లే ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. సోషల్ మీడియాలో అందరూ ఈ సినిమాను పొగిడేశారు. కానీ ఈ పొగడ్తలకు, ఈ టాక్‌కు తగ్గట్లుగా వసూళ్లు మాత్రం రాలేదు. క్రిస్మస్ సెలవుల సీజన్లో విడుదలైనప్పటికీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది.

విడుదలకు ముందు ప్రమోషన్ గట్టిగా చేసినా, సినిమాపై పాజిటివ్ బజ్ ఉన్నా.. ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. దీనికి తోడు సోమవారం క్రిస్మస్ హాలిడే అవ్వగానే ‘హలో’ వసూళ్లు బాగా డ్రాప్ అయిపోయాయి. ఇక ఆ తర్వాత సినిమా పెద్దగా పుంజుకోలేదు.

ఇప్పటిదాకా ‘హలో’ సినిమా ప్రపంచవ్యాప్తగా రూ.17 కోట్ల షేర్ మాత్రమే రాబట్టినట్లు అంచనా. సెకండ్ వీకెండ్లో ‘హలో’ వసూళ్లు ఏమంత పుంజుకోలేదు. మహా అయితే ఈ చిత్రం ఫుల్ రన్లో రూ.20 కోట్ల షేర్ మార్కును అందుకోవచ్చు. ఐతే ఈ చిత్ర థియేట్రికల్ హక్కుల్ని రూ.32 కోట్లకు అమ్మారు. అంటే మూడింట ఒక వంతు నష్టమే అన్నమాట. సినిమా యావరేజ్ స్థాయిని కూడా అందుకోవడం కష్టమే.

అంతిమంగా ‘హలో’ ఫ్లాప్ కేటగిరిలోకే చేరేట్లుంది. ఒక్క యుఎస్‌లో మాత్రమే బయ్యర్ బ్రేక్ ఈవెన్‌కు వచ్చే అవకాశముంది. మొత్తానికి తన కొడుక్కి ఈసారి ఎలాగైనా హిట్టివ్వాలని నాగ్ ఎంతగానో ప్రయత్నించాడు కానీ.. ఆ ప్రయత్నం విఫలమైనట్లే కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English