'ఫిదా' సినిమాతో బల్బు వెలిగిందట

'ఫిదా' సినిమాతో బల్బు వెలిగిందట

లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అనామిక.. ‘ఫిదా’ కంటే ముందు శేఖర్ కమ్ముల తీసిన మూడు సినిమాలు. ఆ మూడూ నిరాశ పరిచాయి. దీంతో ‘ఫిదా’ సినిమాపై పెద్దగా అంచనాల్లేవు జనాలకు. కానీ ఈ చిత్రం అనూహ్యమైన వసూళ్లతో బ్లాక్ బస్టర్ రేంజికి వెళ్లిపోయింది. మామూలుగా శేఖర్ కమ్ముల సినిమాలంటే మల్టీప్లెక్సుల్లో మాత్రమే ఆడతాయని.. క్లాస్ ఆడియన్స్ మాత్రమే ఆదరిస్తారనే ఒక ముద్ర ఉండేది. ‘ఫిదా’ ఆ హద్దుల్ని చెరిపేసింది. బి-సి సెంటర్లలో కూడా ఇరగాడేసింది. ఇందుకు కారణంతో తన గత సినిమాల్లో ఉన్న ఒక లోపాన్ని సరిదిద్దుకోవడమే అని అంటున్నాడు కమ్ముల.

శేఖర్ కమ్ముల ఇంతకుముందు సినిమాలు చూస్తే.. అందులో సహజమైన తెలుగు కనిపించదు. పాత్రలు ఎక్కువగా ఇంగ్లిష్ ఉపయోగిస్తాయి. తెలుగును కూడా ఆ రకంగానే మాట్లాడతాయి. ఐతే ‘ఫిదా’లో ఇలా కాకుండా స్వచ్ఛమైన గ్రామీణ తెలంగాణ భాషను వాడటం ఎక్కువమందికి నచ్చిందని కమ్ముల చెప్పాడు.

‘‘ఆనంద్ సినిమాను చదువుకున్నవాళ్లే చూశారనుకుంటే.. ‘ఫిదా’ జన సామాన్యంలోకి వెళ్లి అందరినీ మెప్పించింది. ఈ రకంగా ఈ చిత్రాన్ని తీయడమే నా ఎదుగుదల అనుకోవచ్చు. ఇంతకుముందు నా సినిమాల్లో కనిపించిన తెలుగు కంటే ‘ఫిదా’లో చూపించిన తెలుగుకు తేడా ఉంటుంది. భాషా పరంగా ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక రకమైన ఫ్లో ఉంటుంది. ఆ మార్పు వల్లే ‘ఆనంద్’, ‘గోదావరి’ లాంటి సినిమాలతో పోలిస్తే ‘ఫిదా’ పెద్ద విజయం సాధించడానికి కారణమైందనుకుంటున్నా’’ అని కమ్ముల అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు