నిఖిల్ వద్దంటే.. చిరంజీవి ఓకే చేశాడా?

నిఖిల్ వద్దంటే.. చిరంజీవి ఓకే చేశాడా?

ముందు ఒక హీరో దగ్గరికి వెళ్లి అతను రిజెక్ట్ చేస్తే.. ఆ తర్వాత ఇంకో హీరో ఓకే చేసి పట్టాలెక్కిన సినిమాలు తెలుగులో చాలానే ఉన్నాయి. తాజాగా ఇలాగే ఒక కథ ఒక హీరో దగ్గర్నుంచి మరో హీరో దగ్గరికి వెళ్లినట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ ను హీరోగా పరిచయం చేయడానికి రంగం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు ‘జత కలిసే’ అనే సినిమా తీసిన రాకేశ్ శశి అనే యువ దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు. ఆ దర్శకుడు చెప్పిన కథ ముందు కళ్యాణ్ కు నచ్చగా.. ఆ తర్వాత చిరంజీవి కూడా స్టోరీ విని ఓకే చేసినట్లు సమాచారం. ఐతే ఈ సినిమా నేరుగా మెగా ఫ్యామిలీ దగ్గరికి రాలేదట.

ముందు యువ కథానాయకుడు నిఖిల్ కు రాకేశ్ ఈ కథ చెప్పాడట. కథ నచ్చలేదో.. లేక దానికి తాను సూటవ్వనని అనుకున్నాడో కానీ.. నిఖిల్ దాన్ని రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ఆ తర్వాత నిర్మాత కొర్రపాటి సాయి ఈ కథను కళ్యాణ్ కు వినిపించడం.. తర్వాత చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలవడం.. చకచకా జరిగిపోయాయి. శ్రీజతో పెళ్లి సమయంలో కళ్యాణ్ ను చూడగానే ఇతను భవిష్యత్తులో హీరో అవుతాడేమో అన్న ఊహాగానాలు వినిపించాయి. లుక్స్ పరంగా కళ్యాణ్ బాగానే ఉన్నాడు. మరి నటన ఎలా ఉంటుందో చూడాలి. కళ్యాణ్ అరంగేట్ర చిత్రానికి మెగా ఫ్యామిలీ నుంచి ఫినాన్షియల్ బ్యాకప్ కూడా ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో జనవరిలోనే సెట్స్ మీదికి వెళ్లొచ్చని తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు