పద్మావతి కాదు.. పద్మావత్

పద్మావతి కాదు.. పద్మావత్

ఈ మధ్య కాలంలో ఇండియాలో ‘పద్మావతి’ స్థాయిలో వివాదాస్పదమైన సినిమా మరొకటి లేదు. డిసెంబరు 1నే విడుదల కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ అభ్యంతరాలు.. బయట ఆందోళనల కారణంగా వాయిదా పడింది. కొన్ని రోజులు ఈ చిత్రం వార్తల్లోనే లేదు. అసలెప్పుడు రిలీజవుతుందన్న సమాచారమే లేదు. ఐతే ఇప్పుడు ఉన్నట్లుండి ‘పద్మావతి’ వార్తల్లోకి వచ్చింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లియరెన్స్ వచ్చినట్లుగా వార్తలొస్తున్నాయి.

ఐతే సెన్సార్ బోర్డు అంత తేలిగ్గా ఏమీ ఈ చిత్రానికి క్లియరెన్స్ ఇవ్వలేదు. అనేక షరతులు విధించింది. ముందు ‘పద్మావతి’ అనే టైటిల్ ను మార్చాలని స్పష్టం చేసింది. దీంతో బన్సాలీ ‘పద్మావత్’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. దీనికి సెన్సార్ బోర్డు కూడా ఓకే చెప్పిందట. ఇక ఈ చిత్రంలో సెన్సార్ బోర్డు ఏకంగా 26 కట్స్ సూచించినట్లుగా వార్తలొస్తున్నాయి. ఇదే నిజమైతే బన్సాలీ టీంకు అంత కంటే పెద్ద షాక్ మరొకటి ఉండదు. అన్ని కట్స్ వేస్తే సినిమా కిల్ అయిపోవడం ఖాయం.

ఐతే దీనిపై బన్సాలీ రివైజ్డ్ కమిటీకి వెళ్లాలని భావిస్తున్నాడు. సెన్సార్ బోర్డు దగ్గర బ్రేక్ పడితే.. రివైజ్డ్ కమిటీకి వెళ్లి క్లియరెన్స్ తెచ్చుకున్న సినిమాలు గతంలో చాలానే ఉన్నాయి. ‘ఉడ్తా పంజాబ్’.. ‘బాబూ మషాయ్ బందూక్ బాజ్’ లాంటి సినిమాల విషయంలో ఇలాగే జరిగింది. మరి బన్సాలీ ఏమేరకు విజయవంతం అవుతాడో చూడాలి. అన్ని అడ్డంకులూ తొలగిపోతే ఈ చిత్రాన్ని జనవరి 26న రిలీజ్ చేయాలని బన్సాలీ భావిస్తున్నట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు