‘ఒక్క క్షణం’లో అవన్నీ లేపేశారట

‘ఒక్క క్షణం’లో అవన్నీ లేపేశారట

వీఐ ఆనంద్ నుంచి గత ఏడాది వచ్చిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’లో సస్పెన్స్ ఎలిమెంట్‌తో పాటు కామెడీ కూడా బాగా వర్కవుటైంది. ఆ సినిమాకు కామెడీ ఒక ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఐతే ఆనంద్ లేటెస్ట్ మూవీ ‘ఒక్క క్షణం’లో అలాంటి ఫన్ మిస్సయింది. సినిమా చాలా వరకు సీరియస్‌గా సాగిపోయింది. కొన్ని చోట్ల కామెడీ కోసం ట్రై చేసినా ఆ సీన్లు అంతగా పండలేదు. ఈ విషయమై హీరో అల్లు శిరీష్ స్పందించాడు.

ఈ సినిమాలో కామెడీ కోసం చాలా సీన్లు చిత్రీకరించామని.. కానీ నిడివి పెరిగిపోతోందని అవన్నీ లేపేశామని అతను చెప్పాడు. సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందే ఒక ఫోక్ సాంగ్ కూడా చేశామని.. దాన్ని కూడా సినిమాలో పెట్టాలనే అనుకున్నామని.. చివరికి లెంగ్త్ ఎక్కవువుతోందని దాన్ని కూడా పక్కన పెట్టేశామని.. సినిమాలో రోలింగ్ టైటిల్స్ అయ్యాక ఆ పాట వస్తుందని శిరీష్ తెలిపాడు.

ఇక కామెడీ లేకపోవడం గురించి వస్తున్న విమర్శలపై శిరీష్ ఆశ్చర్యపోయారు. ఈ సినిమాలో కొందరేమో కామెడీ లేదంటున్నారని.. ఇంకొందరేమో కథ సీరియస్‌గా సాగుతున్నపుడు కామెడీ కోసం ప్రయత్నించడంపై పెదవి విరిచారని.. ఇదేంటో తనకు అర్థం కాలేదని శిరీష్ అన్నాడు. ఇక తన తర్వాతి సినిమా ఏదో ఇంకా ఖరారవ్వలేదని.. ప్రస్తుతం కథలు వింటున్నానని.. ఇంకో నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని శిరీష్ చెప్పాడు. ‘ఒక్క క్షణం’ సినిమాను మలయాళంలోకి కూడా అనువాదం చేసి విడుదల చేయనున్నట్లు శిరీష్ వెల్లడించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు