ప్రాజెక్ట్ Z.. ఇదంతా నిజమేనా??

ప్రాజెక్ట్ Z.. ఇదంతా నిజమేనా??

సందీప్ కిషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. లాక్కుంటే ఎలాంటి అవకాశాన్ని అయినా దక్కించుకోవచ్చు అని నిరూపించాడు. జయాపజయాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా అవకాశాలను దక్కించుకుంటున్నాడు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలను చేస్తున్నాడు. తెలుగులో అతని పరిస్థితి ఎలా ఉందొ తెలిసిందే. కానీ తమిళ్ లో మాత్రం కొద్దోగొప్పో అతని సినిమాలు బాగానే ఆడుతున్నాయి.

ఇటీవల రిలీజ్ అయిన మాయావన్ సినిమా తమిళ్ లో మిక్సుడ్ టాక్ తెచ్చుకుంది. అయితే తెలుగులో కూడా సినిమాను డబ్ చేసి రిలీజ్ చెయ్యాలని నిర్మాతలు అనుకున్నారు. శుక్రవారమే సినిమాను తెలుగులో ప్రాజెక్ట్ z గా రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యారు. ఊరంతా పోస్టర్లు కూడా వేశారు. అయితే ఏమైందో ఏమో గాని సడన్ గా సినిమా షోలను క్యాన్సిల్ చేశారు. అయితే ఓ థియేటర్ లో సినిమా మార్నింగ్ షో నడిచిందని ఒక నెటిజన్ ట్వీట్ చేయడంతో.. అనుమతి లేకుండా సినిమాను ప్రదర్శించారని చిత్ర నిర్మాణ సంస్థ తిరుకుమారన్ ఎంటర్టైన్మెంట్స్ పొలిసు కేసు నమోదు చేసింది.  దీని గురించి సందీప్ చెబుతున్నది ఏంటంటే.. డబ్బింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాలేదని.. సిజి వర్క్ అవ్వలేదని.. రీరికార్డింగ్ ఇంకా ఉందని అన్నాడు. కాని ఎక్కడో ఏదో తేడా కొట్టట్లేదు?

అసలు ఒక సినిమాకు హీరో డబ్బింగ్ చెప్పకుండా.. కంప్యూటర్ గ్రాఫిక్స్ పూర్తవ్వకుండా.. రిలీజ్ డేట్ ఇచ్చేస్తారా? పైగా తమిళ వర్షన్ కు పూర్తయిన సిజి వర్క్ తెలుగు వర్షన్ లో పెండింగ్ ఉన్నాయంటే నమ్మడానికి ఆశ్చర్యకరంగా ఉంది. అలాగే సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసిన సందీప్.. ఇప్పటివరకు డబ్బింగ్ ఎందుకు చెప్పలేదంటారు? ట్రేడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాటేంటంటే.. దాదాపు అన్ని ధియేటర్లకు ప్రింట్ కూడా పంపేసిన తరువాత.. లాస్ట్ మినిట్ లో రిలీజ్ ఆపేశారని. ఆ ఇన్షర్మేషన్ అందని ధియేటర్ ఎక్కడన్నా స్ర్కీన్ చేసి ఉండొచ్చని.. దానికి వీరు ఇలా కలరింగ్ ఇస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు